కేసీఆర్ పై వార్ వన్ సైడ్ అనేలా ఈటెల చెలరేగనున్నాడా

మాజీ మంత్రి ఈటెల రాజకీయం తెలంగాణ రాజకీయాలలో ప్రకంపనలు సృష్టిస్తోంది.అయితే ఇప్పటికే బీజేపీలో ఈటెల చేరుతున్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

అయితే ఈ విషయంపై ఈటెల కూడా ఏ విధంగానూ స్పందించని పరిస్థితి ఉంది.అయితే స్వతహాగా కమ్యూనిస్ట్ భావజాలం కలిగిన మాజీ మంత్రి ఈటెల మత్తతత్వ పార్టీగా ముద్ర పడిన బీజేపీలో కొనసాగగలరా అనేది ఇప్పుడు చిక్కు ప్రశ్నగా మారింది.

అయితే బీజేపీలో చేరితే కేసీఆర్ టార్గెట్ గా విమర్శనాస్త్రాలు సంధించే అవకాశం ఉంది.ఇక ఈటెలను అస్త్రంగా వాడుకుంటూ బీజేపీ రాజకీయ లబ్ది పొందుతూ ఎంతో కొంత సత్తా చాటాలని బీజేపీ బలోపేతానికి అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటోంది.

అయితే ఒకవేళ ఈటెల పై ప్రజలు సానుభూతి వ్యక్తమయితే కేసీఆర్ కు తిప్పలు తప్పకపోవచ్చు.ఇక వార్ వన్ సైడ్ అనేంతలా ఈటెల, కేసీఆర్ మధ్య రాజకీయ యుద్ధం కొనసాగనుంది.

Advertisement

ఇప్పటికే కెసీఆర్ పై  అవకాశం దొరికినప్పుడల్లా విరుచుకుపడుతున్న బీజేపీ ఇప్పుడు ఈటెల రూపంలో మరో అస్త్రం దొరకడంతో ఇక బీజేపీ చెలరేగే అవకాశం కనిపిస్తోంది.కెసీఆర్ కు వ్యతిరేకంగా పావులు కదపడంలో ఈటెల సూచనలు తప్పక తీసుకునేలా కనిపిస్తున్నాయి.

ఇక ఈటెల కూడా కెసీఆర్ ఓటమి లక్ష్యంగా ముందుకు సాగే అవకాశం కనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు