సక్సెస్ కోసం వింక్ బ్యూటీ వెయిటింగ్

వింక్ బ్యూటీగా సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న అందాల భామ ప్రియా ప్రకాష్ వారియర్.ఒక్క సాంగ్ టీజర్ తో ఈ మలయాళీ ముద్దుగుమ్మకి నేషనల్ వైడ్ పాపులారిటీ వచ్చేశింది.

 Wink Beauty Priya Prakash Worrier Waiting For Check Movie Success, Tollywood, Te-TeluguStop.com

దీంతో రాత్రికి రాత్రే ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకొని పెద్ద సెలబ్రెటీ అయిపొయింది.ఇక ఆమెకున్న క్రేజ్ ని అడ్వర్టైజ్మెంట్ కంపెనీలు బాగా ఉపయోగించుకున్నాయి.

ఇక తనకొచ్చిన ఫేమ్ ని ఈ భామ కూడా బాగా వాడుకొని వరుసపెట్టి యాడ్స్ చేసేసింది.రెండు చేతులా డబ్బులు బాగానే సంపాదించింది.

అయితే మొదటి సినిమా రిలీజ్ తర్వాత సినిమాలో ఆమె హీరోయిన్ కాదని తేలిపోయింది.దీంతో ఆమె ఫేమ్ కూడా కొంత వరకు తగ్గింది.

ఈ నేపధ్యంలో నటిగా ప్రూవ్ చేసుకోవడానికి తన ప్రయత్నాలు మొదలు పెట్టింది.

హిందీలోకి ఎంట్రీ ఇచ్చి శ్రీదేవి బంగ్లా అనే సినిమా చేసిన అది రిలీజ్ కి నోచుకోలేదు.అయితే అనూహ్యంగా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో నితిన్ కి జోడీగా చెక్ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం ఈ అమ్మడుకి వచ్చింది.అయితే ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ లాయర్ పాత్రలో చేస్తూ ఉండగా ప్రియా ప్రకాష్ నితిన్ లవర్ గా కనిపిస్తుంది.

గ్లామర్ రోల్ లో తాజాగా రిలీజ్ అయినా ట్రైలర్ గా బాగానే ఆకట్టుకుంది.అయితే సినిమాలో ఆమె పాత్ర నిడివి ఎంత అనేది రిలీజ్ తర్వాతే తెలుస్తుంది.

ఫిబ్రవరి 19న ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది.మరి కమర్షియల్ గ్లామర్ హీరోయిన్ గా సక్సెస్ అయ్యి స్టార్ అవ్వాలని అనుకుంటున్నా ప్రియా ప్రకాష్ డ్రీం కి ఈ చెక్ మూవీ ఎంత వరకు ఉపయోగపడుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube