అఘోరాగా మారబోతున్న విశ్వక్సేన్

టాలీవుడ్ తెలంగాణ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోలు అయిన వాళ్ళు చాలా తక్కువ మంది.ఈ జాబితాలో నితిన్ మాత్రమే ముందుగా క్లిక్ అయ్యాడు.

అయితే అతనికి ఒక స్థాయి గుర్తింపు రావడానికి చాలా సమయం పట్టింది.అయితే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకి పెళ్లి చూపులు సినిమా బ్రేక్ ఇచ్చింది.

అంత వరకు చిన్న పాత్రలకి పరిమితం అయినా విజయ్ దేవరకొండ ఆ సినిమా తర్వాత అందరి దృష్టిని ఆకర్షించాడు.తరువాత వచ్చిన అర్జున్ రెడ్డి, గీతాగోవిందం సినిమాలతో ఒక్కసారిగా స్టార్ గా మారిపోయాడు.

ఇప్పుడు టాలీవుడ్ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఏకంగా పూరి దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ గా విజయ్ దేవరకొండ మారిపోయాడు.విజయ్ దేవరకొండ తర్వాత తెలంగాణ నుంచి అదే ఆటిట్యూడ్ తో విశ్వక్సేన్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

Advertisement

ఈ నగరానికి ఏమైంది సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ యువ నటుడు ఫలక్ నుమా దాస్ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించారు.నాని ప్రొడక్షన్ లో హిట్ సినిమాతో సూపర్ హిట్ కొట్టి ఫ్రేమ్ లోకి వచ్చాడు.

అయితే ఈ కుర్ర హీరోకి విజయ్ స్థాయిలో స్టార్ ఇమేజ్ రాకున్న కొంత వరకు పర్వాలేదు.ప్రస్తుతం విశ్వక్ మలయాళీ సూపర్ హిట్ మూవీ కప్పెల, తమిళ్ హిట్ మూవీ ఓ మై కడపులే రీమేక్ లలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.ఇప్పటికే ఇందులో ఓ మై కడపులే రీమేక్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది.

ఇదిలా ఉంటే వీటితో పాటు విశ్వక్ మరో కొత్త సినిమాకి ఒకే చెప్పినట్లు తెలుస్తుంది.అది పూర్తిగా తన స్వభావానికి భిన్నమైన పాత్ర కావడం విశేషం.అఘోరా పాత్రలో కనిపించడానికి విశ్వక్ ఒకే చెప్పారని టాక్ వినిపిస్తుంది.

కెరియర్ ఆరంభంలోనే ఇలాంటి పాత్రకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తన రూట్ చాలా ప్రత్యేకం అని ఈ యంగ్ హీరో ప్రూవ్ చేసుకునే పనిలో ఉన్నాడు.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు