తెలుగులో ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన “గబ్బర్ సింగ్” చిత్రంలో కెవ్వు కేక అంటూ స్టెప్పులేసి కుర్రకారు గుండెల్లో హిట్ పెంచేసినటువంటి బాలీవుడ్ బ్యూటీ “మలైకా అరోరా” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు నాలుగు పదుల వయసు దాటినా ఇప్పటికీ చాలా యంగ్ గా కనిపిస్తూ యోగా మరియు ఆహారపపు అలవాట్ల గురించి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా పలు సలహాలు, సూచనలు ఇస్తూ ఆరోగ్యం పట్ల బాగానే అవగాహనా కల్పిస్తోంది.
అయితే తాజాగా మలైకా అరోరా ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా ఈ పరిస్థితులలో మాస్కు ధరించకపోవడం వల్ల చాలా అనర్థాలు కలగడమే కాకుండా ఇతరులకు కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు చాలా ఉన్నాయని కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్కులు ధరించాలని తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అవగాహన కల్పించింది.అంతేగాక ఈ మాస్క్ ధరించే విధానం పై అవగాహన కల్పించడానికి ఒక క్యాంపెయిన్ కూడా రన్ చేస్తుంది.
ఇందులో భాగంగా ప్రతి ఒక్కరు మాస్కు ధరించిన సమయంలో తీసుకున్నటువంటి ఫోటోలను తమ సోషల్ మీడియా మాధ్యమాలను షేర్ చేస్తూ @wearekaro అనే హాష్ ట్యాగ్ కి ట్యాగ్ చేయాలని కోరింది.ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా పరిస్థితులలో మాస్కులు ధరించడం పై అవగాహన కల్పిస్తున్న మలైకా అరోరా ని నెటిజన్లు అభినందిస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం మలైకా అరోరా తన భర్త నుంచి విడాకులు తీసుకున్న అనంతరం సపరేట్ గా ముంబై లో ఉన్నటువంటి తన సొంత నివాసంలో నివాసం ఉంటోంది. అంతేగాక ఆ మధ్య కాలంలో మలైకా అరోరా బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ తో ప్రేమలో ఉందని తొందర్లోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నాయి.
కానీ ఇప్పటివరకూ మలైకా అర్జున్ కపూర్ తో తన పెళ్లి ఊసు అడిగినప్పుడల్లా ఎదో ఒక విషయం చెబుతూ దాటవేస్తోంది.







