భర్తను కట్టేసి చితకబాదిన భార్య.. తాగాడనే !

మొదట్లో భర్త తాగొచ్చి భార్యను కొట్టేవాడు.కానీ రోజులు మారాయి.

 Wife, Husband, Crushed, Drink-TeluguStop.com

భర్తలు తాగితే చాలు భార్యలు పూనకం వచ్చినట్లు కోపంతో ఊగిపోతున్నారు.ఓ ఇల్లాలు ఏకంగా భర్త తాగొచ్చాడని భర్తను కింద పడుకోబెట్టి కాళ్లు చేతులు కట్టేసింది.

దుడ్డుగా ఉన్న కర్రతో భర్తపై విరుచుకుపడింది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నెటిజన్ల కామెంట్ల మీద కామెంట్లు పెడుతూ వీడియోను షేర్ చేస్తున్నారు.

భర్త చేతులు, కాళ్లను తాడుతో ఒక గుంజను కట్టేసి ఓ మహిళ చితకబాదింది.

దుడ్డు కర్రతో భర్తను గొడ్డును బాదినట్లు బాదింది.ఆ దెబ్బలకు ఆ భర్త పడుతున్న బాధ చెప్పలేని పరిస్థితి.

తాగొచ్చిన మైకాన్ని దింపి ఇంకెప్పుడు తాగనని ఆ భర్త నోట వచ్చేంత వరకు చితకబాదింది.ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుందో తెలియదు కానీ ఈ వీడియో ఫోస్ట్ చేసిన నిమిషాల్లో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయి విహరిస్తోంది.

నెటిజన్లు తాగొచ్చిన భర్తను ఎలా చితకబాదుతుందో అని ప్రచారం జరుగుతున్నా అసలు విషయం తెలియదు.ఇంతలా కొడుతుందంటే తాగే వచ్చి ఉంటాడని కొంత మంది నెటిజన్లు తెలుపుతున్నారు.

మరి కొందరు ఈ మహిళను ఆదర్శంగా తీసుకోవాలని సూచిస్తుంది.ఇంకొందరు ఈ ఇల్లాలు ఎవరో కానీ దండేసి దండం పెట్టాలని కామెంట్లు పెడుతున్నారు.

అయితే ఈ వీడియోను చూసిన మహిళలు ఈమెను ఆదర్శంగా తీసుకుంటే తాగిన భర్తల పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదని పలువురు నెటిజన్లు వాపోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube