టిక్ టాక్ ప్రియుల‌కు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. మ‌ళ్లీ రాబోతున్న యాప్‌!

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రాచూర్యం పొందిన `టిక్ టాక్` యాప్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.

చైనీస్‌ ఇంటర్నెట్‌ టెక్నాలజీ కంపెనీ `బైటీ డ్యాన్స్` ఆ యాప్‌ను రూపొందించింది.

ఈ యాప్ అన్ని దేశాల్లో కంటే భార‌త్‌లోనే ఎక్కువ‌గా క్లిక్ అయింది.ఆ యాప్ ద్వారా భార‌త్‌లో ఎంద‌రో సామాన్యులు సెల‌బ్రెటీలుగా మారారు.

ఇటీవ‌ల చైనాకు బుద్ధి చెప్పేందుకు టిక్ ‌టాక్‌తో స‌హా 59 యాప్స్‌ను భార‌త్ కేంద్ర ప్ర‌భుత్వం బ్యాన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.దీంతో టిక్ టాక్ ప్రియులు ఎంతో బాధ‌ప‌డ్డారు.

చివ‌ర‌కు మిత్రో, చింగారి, రొపోసో వంటి యాప్ల‌ను.టిక్ టాక్‌కు ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నారు.

Advertisement

‌అయితే తాజాగా స‌మాచారం ప్ర‌కారం.టిక్ టాక్ మ‌ళ్లీ భార‌త్‌లో అడుగుపెట్ట‌బోతోంది.

వాస్త‌వానికి టిక్ టాక్ చైనా కంపెనీ కావడంతో భార‌త్ ప్ర‌భుత్వం బ్యాన్ చేసింది.కానీ, ఇప్పుడు జపాన్‌కు చెందిన సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్ కొనుగోలు చేసేందుకు సిద్ధం అయింది.

ఈ క్ర‌మంలోనే టిక్ టాక్ కోనుగోలుకు భారతీయ భాగస్వామి కోసం సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్ తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.అంతేకాదు, జియో, భారతీ ఎయిర్‌టెల్ వంటి సంస్థ‌ల‌తో చ‌ర్చ‌లు కూడా జ‌రుపుతోంద‌ట‌.

ఒక‌వేల ఈ చ‌ర్చ‌లు స‌క్సెస్ అయితే.మ‌ళ్లీ టిక్ టాక్ భార‌త్‌లో ఎంట్రీ ఇస్తుంది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఇదే జ‌రిగితే టిక్ టాక్ ప్రియులు పండ‌గ చేసుకుంటారు.

Advertisement

తాజా వార్తలు