లోకేష్ ఫ్యూచర్ కి బాబు మార్క్ స్కెచ్ ?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఎత్తు పల్లాలను చూసేసారు.ప్రస్తుతం బాబుు కి 70 సంవత్సరాలు వయసు వచ్చేసింది.

పార్టీ ప్రతిపక్షంలో ఉండడంతో పార్టీ ఉనికిని కాపాడేందుకు అష్టకష్టాలు పడుతూ తన ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా, పార్టీలో ఊపు తెచ్చేవిధంగా నిత్యం ప్రజా ఉద్యమాలు, పోరాటాలు చేస్తూ ఏదో రకంగా అధికార పార్టీని ఇరుకున పెట్టి పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపే విధంగా బాబు ప్రయత్నాలు చేస్తున్నారు.అదీ కాకుండా తన రాజకీయ వారసుడైన నారా లోకేష్ రాజకీయ భవిష్యత్ కు ఎటువంటి ఇబ్బంది లేకుండా, బాబు ఇప్పటి నుంచే అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఆయన అధికార పార్టీ దూకుడు ముందు బాబు ఐడియాలు వర్కవుట్ అవ్వడంలేదు.ఈ నేపథ్యంలోనే లోకేష్ రాజకీయ భవిష్యత్తు కోసం చంద్రబాబు ఓ సరికొత్త ఐడియా వేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం చంద్రబాబు సందర్భం ఉన్నా, లేకపోయినా, అదేపనిగా బీజేపీని పొగుడుతూ అధిష్టానం పెద్దల వద్ద సానుభూతి పొందే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement

గతంలో బీజేపీ పెద్దలను అదేపనిగా తిట్టిపోసిన చంద్రబాబు ఇప్పుడు వారి ప్రసన్నం కోసం తపిస్తున్నారు.అందుకే సందర్భం వచ్చినా, రాకపోయినా అదేపనిగా మోదీ, అమిత్ షా వంటి వారిని పొగిడేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.అలాగే ఏపీ బీజేపీ నాయకులతోనూ సఖ్యతగా ఉంటూ వస్తున్నారు.

ఇప్పటికే ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు బాటలోనే నడుస్తూ, ఆయన చేస్తున్న పోరాటాలకు మద్దతు ఇస్తున్నారు.అయితే కేంద్రంలో ఇంకా అటువంటి పరిణామాలు ఏర్పడకపోవడంతో బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో బాబు నిమగ్నమయ్యారు.

క్రమక్రమంగా బీజేపీకి దగ్గరై ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే 2024 ఎన్నికల నాటికి తిరుగుండదు అనేది చంద్రబాబు ఆలోచన.

ఎందుకంటే ఏపీలో ఒక సామాజిక వర్గం బలం ఎక్కువగా ఉన్న పవన్ బీజేపీతో ఇప్పటికే పొత్తు పెట్టుకున్నారు.తాము కూడా బీజేపీతో కలిస్తే 2014 ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయని, అప్పుడు సులువుగా విజయం సాధించవచ్చని, లోకేష్ ను అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలనేది చంద్రబాబు ప్లాన్ గా తెలుస్తోంది.అందుకే గతంలో తాను బీజేపీ పెద్దలను తిట్టిన అన్ని విషయాలను పక్కనపెట్టి వారిని ప్రసన్నం చేసుకునేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...

అనే అభిప్రాయాలు వ్యక్తంం అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు