రాజకీయ వ్యూహకర్త గా ఐ ప్యాక్ అధినేత ప్రశాంత్ కిషోర్ ఇటీవల చాలా పాపులర్ అయిన విషయం తెలిసిందే.2019 లో అటు ఏపీ లో వైసీపీ పార్టీ,2020 లో ఇటు మరోసారి ఢిల్లీ లో ఆప్ పార్టీ అధికారంలోకి రావడం తో పీకే కు మరింత డిమాండ్ పెరిగిపోయింది.ఈ రెండు పార్టీలకు కూడా ఐ ప్యాక్ సంస్థ రాజకీయ వ్యూహాలను రచ్చించి అధికారాన్ని అందించింది.అయితే ఇప్పుడు ఆ ఆమ్ ఆద్మీ పార్టీ పీకే కు ఒక ఓపెన్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది.
తమ పార్టీలో చేరేందుకు ముందుకు వస్తే పార్టీలో చేర్చుకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ ఆప్ సీనియర్ నేత సంజయ్ సింగ్ వ్యాఖ్యానించారు.ఇటీవల ఢిల్లీ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీ 62 స్థానాలలో విజయాన్ని అందుకొని మూడోసారి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
అయితే ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఆప్ పార్టీ ఇప్పుడు పలు రాష్ట్రాల్లో కూడా ఆ పార్టీ ని బలోపేతం చేయడం పై దృష్టి సారించినట్లు తెలుస్తుంది.ఈ క్రమంలోనే పీకే కు ఇలాంటి ఓపెన్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది.
ప్రశాంత్ కిషోర్ తమ పార్టీలో చేరితే ఈ యేడాది అక్టోబర్‌లో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ ఆప్ పార్టీ నుంచి గట్టిపోటీ ఇవ్వొచ్చని నేతలు యోచనలో ఉన్నారు.అయితే గతంలో కూడా పీకే కు నితీష్ కుమార్ పార్టీ జేడీయూ లో ఆహ్వానం లభించడం ఆ పార్టీ లో చేరడం జరిగింది.
అయితే ఇటీవల ఢిల్లీ ఎన్నికలకు కొద్దీ రోజుల ముందే క్రమశిక్షణ చర్యల్లో భాగంగా పార్టీ నుంచి పీకే ను బహిష్కరించిన విషయం తెలిసిందే.మరి ఇప్పుడు ఆప్ ఆహ్వానాన్ని మన్నించి పీకే ఆ పార్టీ లో చేరతారా,లేదంటే రాజకీయ వ్యూహకర్త గానే కొనసాగిపోతారా అన్న విషయం పై ఎలాంటి క్లారిటీ లేదు.







