వైరల్‌ : ఇతడి లక్‌ను చూసి ప్రతి ఒక్కరు కుళ్లుకోవాల్సిందే

ఈమద్య రాజకీయాల్లో చిన్న పదవి గెలిచినా దక్కించుకున్నా కూడా సమాజంలో చాలా పేరున్న వ్యక్తిగా గౌరవిస్తున్నారు.చాలా మంది రాజకీయాల్లోకి సేవ చేసేందుకు వెళ్తున్నాం అంటారు కాని ఎక్కువ శాతం మంది మాత్రం డబ్బు సంపాదించేందుకు వెళ్తున్నట్లుగా వారి ప్రవర్తన బట్టి తెలుస్తుంది.

 Tamilanadu Farmer Two Wifes Win In Panchayati Elections-TeluguStop.com

గ్రామ సర్పంచ్‌ అయితే రెండు తరాల వరకు కూర్చుని తినేంత సంపాదించుకోవచ్చు అనేది జనాల మాట.అలాంటిది ఒకే ఇంట్లో ఇద్దరు సర్పంచ్‌లు ఉంటే ఆ కుటుంబం పరిస్థితి ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Telugu Tamilanadu, Tamilanaduwifes, Telugu General, Telugu, Serpunch-

తన భార్య సర్పంచ్‌ అయితే భర్త తానే సర్పంచ్‌ అన్నట్లుగా చెలామని అవుతూ ఉంటాడు.అలాంటిది ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉండి, ఆ ఇద్దరు భార్యలు కూడా వేరు వేరు గ్రామాలకు సర్పంచ్‌లు అయితే పరిస్థితి ఎలా ఉంటుందో.ఆ భర్త పరిస్థితి ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.మీరు ఇక్కడ ఫొటోలో చూస్తున్న వ్యక్తి ఆ పరిస్థితినే ఎంజాయ్‌ చేస్తున్నాడు.ఆయన మొహంలో ఆనందాన్ని చూడవచ్చు.ఇద్దరు భార్యలున్న వ్యక్తి రాజకీయాల్లో చేయకూడదని కొందరు అంటూ ఉంటారు.

కాని ఈయన మాత్రం తన ఇద్దరు భార్యలను సర్పంచ్‌లుగా గెలిపించుకుని రెండు గ్రామాలకు సర్పంచ్‌ అయ్యాడు.

Telugu Tamilanadu, Tamilanaduwifes, Telugu General, Telugu, Serpunch-

తమిళనాడులో ఇటీవల జరిగిన గ్రామ పంచాయితీ ఎన్నికల్లో ఈ సంఘటన జరిగింది.తమిళనాడు తిరువణ్ణామలై జిల్లా వందవాసి గ్రామ పంచాయితీ సర్పంచ్‌గా ధనశేఖర్‌ పెద్ద భార్య సెల్వీ ఇప్పటికే సర్పంచ్‌ కాగా, ఇటీవల జరిగిన ఎన్నికల్లో మళ్లీ సర్పంచ్‌గా ఎన్నిక అయ్యింది.పక్కనే ఉండే కోవిల్‌ కుప్పం గ్రామ నివాసి అయిన చిన్న భార్య అక్కడ సర్పంచ్‌గా మొదటి సారి పోటీ చేసి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.

వీరిద్దరి విజయంలో ధనశేఖర్‌ కీలకంగా వ్యవహరించాడంటూ స్థానికులు చెబుతున్నారు.మొత్తానికి ఇద్దరు భార్యల ముద్దుల మొగుడు కాస్త రెండు గ్రామాల ముద్దుల సర్పంచ్‌ అయ్యాడన్నమాట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube