జనసేనతో పవన్ కు ఇంత ఇబ్బంది వచ్చిపడిందా ?

బీజేపీ తో కలిసి వెళ్లేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నదనే విషయం అందరికి స్పష్టంగా అర్ధం అవుతోంది.ప్రస్తుతం పార్టీ ఉన్న పరిస్థితుల్లో ముందు ముందు రాజకీయంగా నిలదొక్కుకోవాలంటే అది తన ఒక్కడి వల్లా కాదని, ఏదో ఒక పార్టీ అండదండలు ఉండాలని పవన్ భావిస్తున్నాడు.

ఈ క్రమంలోనే ఆయన తెలుగుదేశం పార్టీకి దగ్గరవుతున్నాడని అంతా భావిస్తూ వస్తున్నారు.అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకంటే బీజేపీ పార్టీతో ముందుకు వెళ్లడమే బెటర్ అన్న ఆలోచనలో పవన్ ఉన్నాడు.అందుకే బీజేపీకి బాగా దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు.

తాను బీజేపీకి ఎఫ్పుడూ దూరంగా లేనని పవన్ కళ్యాణ్ కామెంట్ చేయడంతో ఆయన త్వరలోనే ఆ పార్టీకి దగ్గర కాబోతున్నాడనే చర్చకు బలం చేకూరింది.

అమిత్ షాను పొగిడిన మరుసటి రోజే బీజేపీకి అనుకూలంగా మరికొన్ని వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్.దీంతో పవన్ కళ్యాణ్, బీజేపీ ఒక్కటవుతారనే ప్రచారం బలపడింది.అయితే పవన్ తో కలిసి వెళ్లేందుకు కేంద్ర బీజేపీ పెద్దలు సుముఖంగానే ఉన్నా జనసేనను బీజేపీలో విలీనం చేయాల్సిందే అనే నిబంధ పెట్టారు.

Advertisement

కానీ పవన్ మాత్రం తాము విలీనం చేయనని, కావాలంటే పొత్తు పెట్టుకుంటాను అంటూ చెప్పడంతో ఈ విషయంలో ఏ క్లారిటీ రావడంలేదు.బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కూడా జనసేనను విలీనం చేస్తే స్వాగతిస్తామని కూడా ప్రకటించేశారు.

పవన్ బీజేపీలు కలిసి పనిచేసేందుకు ఒక అంగీకారానికి వచ్చినా వారి మధ్య జనసేన పార్టీ అడ్డు గోడగా ఉన్నట్టు కనిపిస్తోంది.

బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని పవన్ భావిస్తుంటే బీజేపీ మాత్రం జనసేనను తమ పార్టీలో విలీనం చేస్తేనే కలిసి పని చేసేందుకు సిద్ధమని ఇప్పటికే పవన్ కు క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం.మొత్తానికి ఏపీలో క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న వైసీపీ, టీడీపీలకు ధీటుగా ఎదగాలని భావిస్తున్న పవన్ కళ్యాణ్‌ బీజేపీ తో నడవడం ఖాయం అయిపొయింది.కానీ జనసేన పార్టీని విలీనమా, పొత్తా అనే విషయంలోనే ఏదో ఒక స్పష్టమైన అంగీకారం వస్తేనే ఈ విషయంలో క్లారిటీ వస్తుంది.

ఒకవేళ పవన్ విలీననానికి అంగీకరిస్తే ఏపీ బీజేపీ సీఎం అభ్యర్థిగా పవన్ ను బీజేపీ ప్రకటించే అవకాశమూ లేకపోలేదు.

నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 
Advertisement

తాజా వార్తలు