వైకాపా ప్రభుత్వంకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు నేడు దీక్ష చేపట్టిన విషయం తెల్సిందే.భవన నిర్మాణ కార్మికులు ఇసుక కొరత కారణంగా పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అంటూ చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు.
దీక్షలో పాల్గొన్న బాబు సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించాడు.ఈ సందర్బంగా వైకాపా నాయకులపై కూడా తీవ్ర స్థాయిలో చంద్రబాబు మండి పడ్డాడు.
బాబు వ్యాఖ్యలకు కౌంటర్‌గా వైకాపా ఎమ్మెల్యే పార్థసారధి స్పందించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై పార్ధసారధి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.
టీడీపీ నేతలు అంతా కూడా ఇసుక బకాసురులు.అలాంటి వారు ఇప్పుడు మా ప్రభుత్వం వల్ల ఇసుక కొరత వచ్చిందని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందంటూ పార్థసారది ఎద్దేవ చేశాడు.
అసలు ఇసుకకు ఇలాంటి పరిస్థితి రావడంకు ప్రధాన కారణంగా టీడీపీ నాయకులు అని ఆయన అన్నారు.ప్రభుత్వం వెబ్ సైట్లను దొంగతనంగా హ్యాక్ చేయించడంతో పాటు డేటాను దొంగిలించేందుకు ప్రయత్నించడం బాబు పనితనం అన్నాడు.
అసలు చంద్రబాబుకు డేరా బాబాకు పెద్దగా తేడా లేదేమో అనిపిస్తుంది అంటూ ఆయన ఎద్దేవ చేశాడు.







