పైలట్‌లా టోపీ.. సెల్ఫీలకు ఫోజులు: శాన్‌ఫ్రాన్సిస్కో ఎయిర్‌పోర్టులో ఆకట్టుకుంటున్న పందిపిల్ల

పందులు ఆకాశంలో ఎగరకపోవచ్చు.కానీ ఈ పంది మాత్రం విమానాలను ఎక్కే వారికి ఒత్తిడిని తగ్గించడంలో సాయం చేస్తోంది.

వివరాల్లోకి వెళితే.జూలియానా అనే ఐదేళ్ల పంది తన యజమాని టాటియానా డానిలోవాతో కలిసి శాన్‌ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయంలోని ‘‘వాగ్ బ్రిగేడ్’’ విభాగంలో సేవలు అందిస్తోంది.

దీనిలో భాగంగా ఎయిర్‌పోర్టులో ఇతర జంతువులను, ప్రయాణికులను తన విన్యాసాలతో ఉత్సాహపరిచేది.జూలియానా అల్లరి కారణంగా విమానం ఎక్కేవారికి ఒత్తిడి ఇట్టే ఎగిరిపోయేది.

పైలట్‌లా క్యాప్ పెట్టుకుని, ఎరుపు రంగు గోళ్లతో అందంగా తయారైన జూలియానా ఎయిర్‌పోర్ట్ మెటల్ డిటెక్టర్స్ వద్ద ప్రయాణికులను అలరించేది.ప్యాసింజర్స్‌తో కలిసి సెల్ఫీలు దిగడం, తన బొమ్మ పియానాతో ట్యూన్‌ చేస్తూ ప్రయాణికులకు వీడ్కోలు పలికేది.

Advertisement

జూలియానాతో గడపటం ద్వారా ప్రయాణికులు ఎంతో సంతోషపడేవారని.వారు పని మీద బయటికొచ్చామన్న సంగతి మరిచిపోయి.

విహారయాత్రకు వచ్చినట్లు గడిపేవారని పందిపిల్ల యజమాని డానిలోవా తెలిపారు.

లిలో తన యజమాని డానిలోవాతో కలిసి శాన్‌ఫ్రాన్సిస్కో డౌన్‌టౌన్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తుంది.కేవలం సేంద్రీయ కూరగాయలు, ప్రోటీన్స్ ఉన్న ఆహారాన్ని మాత్రమే తింటుంది.చుట్టుపక్కల వారితో కలిసి ప్రతిరోజూ వాకింగ్‌కు వెళుతూ ఉంటుంది.

శాన్‌ఫ్రాన్సిస్కో ఎయిర్‌పోర్టు గెస్ట్ సర్వీస్ మేనేజర్ జెన్నీఫర్ కజారియన్ మాట్లాడుతూ.లిలో ప్రపంచంలోనే మొట్టమొదటి ఎయిర్‌పోర్ట్ థెరపీ పందని తెలిపారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
బెడ్‌రూమ్‌లో రాక్షసి ఉందనుకున్న చిన్నారి.. తీరా వెతికితే ఊహించని షాక్..?

‘‘వాగ్ బ్రిగేడ్’’ కార్యక్రమంలో అన్ని జాతుల కుక్కలు సేవలందిస్తున్నాయని జెన్నీఫర్ వెల్లడించారు.ప్రయాణీకుల ఒత్తిడిని తగ్గించడం తమ ప్రధాన లక్ష్యమని ఆమె తెలిపారు.

Advertisement

తాజా వార్తలు