తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన దగ్గర నుంచి రోజా హావాకు ఎక్కడా ఇబ్బంది లేకుండా వస్తూ ఉంది.వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా అప్పటి సీఎం చంద్రబాబు మీద ఆయన తనయుడు లోకేష్ మీద ఆమె సెటైర్లు వేస్తూ వైసీపీ కి మంచి మైలేజ్ తీసుకువచ్చేవారు.
జగన్ కూడా ఆమె విషయంలో చాలా సానుకూలంగా ఉంటూ వచ్చారు.ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రోజా కు కీలకమైన మంత్రి పదవి దక్కుతుందని అంతా భావించగా జగన్ ఆమెకు ఆ అవకాశం కల్పించలేదు.
దీంతో ఆమె చాలా అసంతృప్తికి గురయ్యారు.కానీ ఆ తరువాత ఆమెకు ఏపీ ఐఐసి ఛైర్మెన్ గా పదవి అప్పగించి మంచి ప్రాధాన్యతే కల్పించారు జగన్.
ఇంతవరకు బాగానే ఉన్నా కొద్ది రోజులుగా తెలంగాణాలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మె విషయంలో రోజా కేసీఆర్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవ్వడంతో పాటు ఈ విషయంలో జగన్ ను కేసీఆర్ అనుమానించే పరిస్థితి తలెత్తడంతో జగన్ రోజాపై తీవ్రంగానే ఆగ్రహం వ్యక్తం చేశారట.ఇక అప్పటి నుంచి రోజా కు ప్రాధాన్యం తగ్గిస్తూ వస్తున్నారట జగన్.
ఇక ఏపీ ఐఐసి పదవిపై రోజా కూడా చాలానే అసంతృప్తిగా ఉన్నారట.ఇదే సమయంలో లక్ష్మీ పార్వతి ని ఏపీ తెలుగు అకాడమీ చైర్ పర్సన్‌గా నియమించడం రోజాకు మింగుడుపడడంలేదని, దీనికారణంగా ఆమె జగన్ పై చాలా అసంతృప్తిగా ఉన్నట్టు వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
వైసీపీ తరపున తాను ఎన్నో పోరాటాలు చేసి అప్పటి టీడీపీ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేసానని ఈ సందర్భంగా తాను సామాజికంగా, ఆర్థికంగా ఎంతో నష్టపోయానని కానీ లక్ష్మి పార్వతి కేవలం అప్పుడప్పుడు మీడియా వేదికగా కొన్ని కొన్ని విమర్శలు చంద్రబాబు మీద చేసేదని కానీ జగన్ తనతో సమానంగా ఆమెకు తెలుగు అకాడమీ చైర్మన్ గా పదవి కేటాయించడం ఏంటని ఆమె తన సన్నిహితుల వద్ద వాపోతున్నారట.







