ఐఐటీ లో పట్టా పొందాం అంటే ఎవరైనా ఒక మంచి మల్టీ నేషనల్ కంపెనీ లో ఉద్యోగం సంపాదించి లక్షల్లో జీతం సంపాదించాలని అని భావిస్తాం.కానీ బీహార్ కు చెందిన శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి మాత్రం లక్షలు సంపాదించే ఉద్యోగాన్ని వదులుకొని రైల్వే డివిజన్ లో ట్రాక్ మెన్ గా గ్రూప్ డి ఉద్యోగంలో చేరాడు.
వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా నిజంగా ఇది నిజం.ఐఐటీ లో బీటెక్,ఎంటెక్ పట్టా పుచ్చుకున్న శ్రావణ్ కుమార్ ఎమ్ ఎన్ సీ లను కాదనుకొని రైల్వే ఉద్యోగం లో చేరాడు.
అయితే ఈ ఉద్యోగం కోసం వచ్చిన ఆ యువకుడి సర్టిఫికెట్లు చూసి రైల్వే అధికారులు బెంబేలెత్తిపోయారు.ఐఐటీ లో పట్టా పుచ్చుకున్నప్పటికీ తనకు ఉద్యోగ భద్రత ముఖ్యమని ప్రభుత్వ ఉద్యోగం దానికి సరైన పరిష్కారం అని ఇలా రైల్వే ఉద్యోగం లో చేరినట్లు తెలిపాడు.
అయినా ఒక ఐఐటీ పట్ట భద్రుడు అయిన ఆ యువకుడు ఇలా కార్పొరేట్ సంస్థలను వదిలుకొని ఇలా రైల్వే ఉద్యోగం లోకి రావడం పై రైల్వే డిపార్ట్ మెంట్ అధికారులు కూడా ఆశ్చర్యపోతున్నారు.ఎంతైనా ఐటీ సంస్థలలో ప్రయివేట్ ఉద్యోగాలకు సెక్యూరిటీ లేదు అని చెప్పడానికి ఈ శ్రావణ్ కుమార్ నిర్ణయమే నిదర్శనం.







