అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై ఇంటా , బయట కూడా నిరసన సెగలు వినిపిస్తూనే ఉంటాయి, కనిపిస్తూనే ఉంటాయి.తన విధానాలు నచ్చక , తప్పక చాలా ప్రజలు, అధికారులు కిక్కురు మనకుండా సైలెంట్ గా ఉంటూ వచ్చారు.
కానీ ప్రస్తుతం ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ట్రంప్ పై విమర్శలు వెల్లువెత్తాయి.ట్రంప్ పై ప్రపంచ వ్యాప్తంగా, అమెరికాలో సైతం నిరసనలు పెల్లుబుకుతున్నాయి.

తాజాగా ట్రంప్ పై నిరసనలు వ్యక్తం చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.నిన్ను చంపడానికి మమ్మల్ని దేవుడు కత్తులతో పంపించాడు, ఇక కాచుకో అంటూ మహ్మద్ ఒమర్ హాజీ అనే వ్యక్తి ఫ్లోరిడాలోని వాల్‌మార్ట్ షాపింగ్ మాల్ లో గట్టిగా అరిచాడు.దాంతో అక్కడి సిబ్బంది పోలీసులకి సమాచారం అందించడంతో హుటాహుటిన వచ్చిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

అక్కడికి పోలీసులు వచ్చేలోగా మార్ట్ లో ఉన్న వారిని కత్తులతో బెదిరించి, కొంతమందిని గాయపరిచాడు.అయితే అతడిని అరెస్ట్ చేసి తీసుకు వెళ్ళే సమయంలో పోలీసుల ముందే ట్రంప్ కి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడు.ఈ వ్యాఖ్యలు పోలీసుల బాడీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపడుతున్నారు.







