కాంమ్రేడ్‌ బోర్‌ కొట్టించిన మాట వాస్తమే అంటూ ఒప్పుకున్న రౌడీ

విజయ్‌ దేవరకొండ ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రంపై ఫ్యాన్స్‌ మరియు ప్రేక్షకులు ఏ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.భారీ ఎత్తున అంచనాలున్న డియర్‌ కామ్రేడ్‌ చిత్రం సెకండ్‌ హాఫ్‌ బోరింగ్‌గా అనిపించింది అంటూ టాక్‌ బయటకు వచ్చింది.

 Vijay Devarakonda About Dear Comrade Movie Boring-TeluguStop.com

సినిమా దాదాపుగా మూడు గంటలు ఉండటం వల్ల పరమ బోరింగ్‌గా ఉందని కొందరు అంటున్నారు.మొత్తానికి సినిమా కాస్త బోర్‌ కొట్టించింది అనేది వాస్తవం.

ఈ విషయాన్ని విజయ్‌ దేవరకొండ కూడా ఒప్పుకున్నాడు.

కాంమ్రేడ్‌ బోర్‌ కొట్టించిన

తాజాగా సినిమాకు వచ్చిన రెస్పాన్స్‌తో పాటు మంచి కలెక్షన్స్‌ వస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సభ్యులు థ్యాంక్స్‌ మీట్‌ ఏర్పాటు చేయడం జరిగింది.అన్ని సినిమాలకు మాదిరిగానే ఈ సినిమాకు కూడా రొటీన్‌గా థ్యాంక్స్‌ మీట్‌ ఏర్పాటు చేయడం చర్చనీయాంశం అవుతుంది.ఇదే సమయంలో సినిమాలో సెకండ్‌ హాఫ్‌ కాస్త స్లోగా సాగిన విషయంపై విజయ్‌ దేవరకొండ స్పందించాడు.

ఒప్పుకుంటున్నాం, కాస్త స్లో అయ్యింది, అయితే సినిమా ఫీల్‌ పోకుండా ఉండే ఉద్దేశ్యంతో అలా స్లో కథనం సాగించినట్లుగా ఏదో చెప్పే ప్రయత్నం చేశాడు.

కాంమ్రేడ్‌ బోర్‌ కొట్టించిన

అర్జున్‌ రెడ్డి, గీత గోవిందం చిత్రాలు బ్లాక్‌ బస్టర్‌ అయ్యి, ట్యాక్సీ వాలా చిత్రానికి మంచి మార్కులు పొందిన విజయ్‌ దేవరకొండ ఈ చిత్రంతో కూడా నటుడిగా తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు.అయితే సినిమా విషయంకు వచ్చేప్పటికి కథ మరియు కథనం విషయంలో దర్శకుడు ప్రేక్షకులను నిరాశ పర్చాడు.దర్శకుడు భరత్‌ కమ్మ ఇంకాస్త బెటర్‌గా చేయాల్సింది అనిపిపించింది.

రష్మిక మరియు విజయ్‌ల కాంబో మరోసారి ఆకట్టుకుంది.సంగీతం కూడా బాగుంది.

కథనం విషయంలోనే ఇబ్బంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube