ఐసిసి వరల్డ్ కప్ లో పాకిస్థాన్ సెమి ఫైనల్ కి వెళ్లడం ఖాయమని అంతా అనుకున్నప్పటికీ ఒక్కసారిగా పరిస్థితులు తారుమారయ్యాయి.దరిద్రం దెబ్బకి దాయాదులు వెళ్లే పరిస్థితి దాదాపు క్లోజయినట్లే.
బుధవారం న్యూజిలాండ్ – ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో కివీస్ గెలిస్తే బంగ్లాపై గెలిచి సెమిస్ లోకి ప్రవేశించాలని అనుకున్నారు.

కానీ ఊహించని విధంగా కివీస్ ఇంగ్లాండ్ చేతిలో ఓటమి పాలై 11పాయింట్లతో నాలుగవ స్థానానికి పడిపోయింది.ఇక పాక్ 9 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది.రేపు బాంగ్లాదేశ్ ఆడాల్సిన ఆఖరి లీగ్ మ్యాచ్ లో భారీ పరుగుల తేడాతో గెలిస్తేనే రన్ రేట్ సాయంతో సెమిస్ కు వెళ్లే అవకాశం ఉంటుంది.
కానీ అది అంత ఈజీ కాదు.
ఇంగ్లీష్ దేశాలను సైతం ముచ్చెటమాలు పట్టించి వెస్ట్ ఇండీస్ ను సైతం మట్టికరిపించిన బంగ్లాను ఆ రేంజ్ లో ఓడించడమంటే ఒకదెబ్బలో కొండ పిండి కావడం వంటిది.అంటే నెట్ రన్‌రేట్ -0.792 ఉన్న పాక్.400పరుగులు చేసి బాంగ్లాదేశ్ ను 84 పరుగులకే ఆలౌట్ చేయాలి.అప్పుడు +0.175 నెట్ రన్ రేట్ తో ఉన్న కివీస్ ను వెనక్కి నెట్టవచ్చు.కానీ ఇది సాధ్యమయ్యే పని కాదు.
రేపు జరగబోయే మ్యాచ్ లో పాక్ ఏం చేస్తుందో చూడాలి మరి.
.







