అక్కినేని ఫ్యామిలీ కోడలు సమంత తాజాగా ‘ఓ బేబీ’ చిత్రంలో నటించిన విషయం తెల్సిందే.ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఓ బేబీ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను నిన్న హైదరాబాద్‌లో నిర్వహించారు.
ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో హీరో వెంకటేష్ మరియు రానాలు హాజరు అయ్యారు.సురేష్‌బాబు నిర్మించిన ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.
ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వెంకీ మరియు రానాలు పాల్గొనడంతో సినిమాపై ఆసక్తి మరింతగా పెరిగింది.ఇక ఈ వేడుకలో సమంత వేసుకున్న డ్రస్‌పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
హీరోయిన్స్ ఇలాంటి డ్రస్‌లు వేసుకోవడం చాలా కామన్.సినిమాల్లో మాత్రమే కాకుండా ఆడియో వేడుకల సమయంలో కూడా ఇలాంటి డ్రస్‌లు వేసుకుంటూ ఉంటారు.అయితే ఈ వేడుకలో తన భర్త కుటుంబ సభ్యులతో పాటు తన కన్న తల్లి కూడా పాల్గొంది.అందుకే సమంత కాస్త పద్దతైన డ్రస్ వేసుకుంటే బాగుండేది.
గతంలో పలు సార్లు సమంత అత్యంత హుందాగా మంచి డ్రస్‌ను వేసుకున్న సందర్బాలు ఉన్నాయి.కాని ఈసారి మాత్రం క్లీవేజ్ షో చేసే డ్రస్ వేసుకోవడం విమర్శల పాలవుతోంది.
వెంకటేష్ మరియు రానా వంటి స్టార్స్ పాల్గొన్న ఈ వేడుకలో మీరు ఇలాంటి డ్రస్ వేసుకోకుండా ఉంటే బాగుండేది.మీరు ఎందుకు ఇలా చేస్తున్నారంటూ ఫ్యాన్స్ కొందరు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అయితే సమంతకు మాత్రం కొందరు మద్దతు పలుకుతున్నారు.చిన్న విషయంలో చిల్లర వ్యాఖ్యలు చేయడం ఏంటీ అంటూ ట్రోల్స్ పై సమంత అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.