ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి.ప్రధాన పార్టీలు వైసీపీ, టీడీపీ ఇన్ని రోజులు తమ ఇద్దరి మధ్యనే పోటీ ఉండబోతుంది అని భావించాయి.
అయితే ఇప్పుడు జనసేన కూడా రేస్ లోకి వచ్చి తాను కూడా ప్రధాన ప్రత్యర్ధి అని నిరూపించుకుంది.చాలా చోట్ల జనసేన పార్టీ బలంగా ఉండటంతో పాటు టీడీపీ, వైసీపీ పార్టీలకి గెలుపుని దూరం చేయబోతుంది అనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తుంది.
ఈ నేపధ్యంలోనే వైసీపీ సినీ నటులని తెర ముందుకి తీసుకొచ్చి లబ్ది పొందాలని ప్రయత్నం చేస్తుంది.
అయితే ఇప్పుడు జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా చిత్ర పరిశ్రమ నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగంలోకి దిగుతున్నాడు.
ఈ రోజు విశాఖ జిల్లాలో రామ్ చరణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలుస్తుంది.ఇక ఇప్పటికే మెగా హీరోలు వరుణ్ తేజ్ తన తండ్రి నాగబాబు తరుపున గోదావరి జిల్లాలో ప్రచారం నిర్వహిస్తున్నారు.
అలాగే నిహారిక కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంది.మరో వైపు అల్లు అర్జున్ కూడా ప్రచారానికి దూరంగా ఉన్న తన మద్దతు ఎప్పుడు జనసేన కి ఉంటుంది అని చెప్పుకొచ్చాడు.
ఈ నేపధ్యంలో జనసేన పార్టీకి మళ్ళీ మెగా ఫ్యామిలీ అండ గట్టిగా దొరకడంతో పాటు, సినిమా ఇండస్ట్రీ చాలా మంది నటులు కూడా జనసేన తరుపున ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.







