విజయ్ సేతుపతి, త్రిష కాంబినేషన్ లో తమిళంలో ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 96.క్లాసికల్ లవ్ స్టొరీగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమాకి తమిళ ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు.
దీంతో ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి చూపించిన టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు వెంటనే రీమేక్ రైట్స్ ని కొనేసి తమిళంలో సినిమా తెరకెక్కించిన ప్రేమ్ కుమార్ ని రంగంలోకి దించాడు.ఇన్ని రోజులు ఈ సినిమా తెలుగు స్క్రిప్ట్ వర్క్ పై ద్రుష్టి పెట్టిన చిత్ర యూనిట్ తాజాగా సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీ అయ్యింది.
శర్వానంద్, సమంత హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి దిల్ రాజు జాను అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.అలాగే ఉగాది సందర్భంగా శనివారం సినిమాని గ్రాండ్ గా ప్రారంభించారు.
ఇదిలా తమిళ ఒరిజినాలిటీలో కొన్ని మార్పులు చేసి తెలుగు ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యే విధంగా దర్శకుడు కథని సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.ఇక తాజాగా మజిలీతో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న సమంత కెరియర్ లో ఈ సినిమా మరో క్లాసిక్ గా నిలిచే అవకాశం ఉందని తెలుస్తుంది.







