చాలా కాలం తర్వాత గరుడ వేగతో సూపర్ హిట్ కొట్టిన యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కల్కి అనే సినిమా షూటింగ్ లో వున్నాడు.దీనిపైన కూడా మంచి అంచనాలు వున్నాయి.
చాలా కాలం తర్వాత మళ్ళీ సినిమాలో రాజశేఖర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నాడు.ఈ సినిమాని సికే ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాజశేఖర్ కెరియర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.
ఇదిలా వుంటే రాజశేఖర్ గతంలో కన్మణి దర్శకత్వంలో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమాని తెరకెక్కించాడు.
ఇక ఆ సినిమాని సి కళ్యాణ్ నిర్మించాడు.
ప్రస్తుతం కల్కీ సినిమా కూడా ఇదే నిర్మాత నిర్మిస్తున్నాడు.దీంతో ప్రస్తుతం కల్కీని వున్నా హైప్ ని తన పాత సినిమా కోసం కళ్యాణ్ వాడుకుంటూ దానిని ముందుకి తీసుకొచ్చాడు.
అర్జున టైటిల్ తో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 15న రిలీజ్ చేయబోతున్నారు.
అయితే సక్సెస్ ట్రాక్ ఎక్కే ప్రయత్నంలో వున్న రాజశేఖర్ కి ఈ అర్జున సినిమా ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా అనే డౌట్ ఇప్పుడు ఇండస్ట్రీలో వుంది.