కొండపి అసెంబ్లీ నియోజకవర్గం.ప్రకాశం జిల్లాలోని ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించిన నియోజక వర్గంగా దీనిని పెద్ద ఎత్తున చెప్పుకోవచ్చు.2014 ఎన్నికల్లో ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా.ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజ నేయ స్వామిని రిజైన్ చేయించి మరీ ఇక్కడ నుంచి టీడీపీ తరఫున బరిలోకి దింపారు చంద్రబాబు.
ఈ నేపథ్యంలో కీలకమైన ఈ స్థానం నుంచి డోలా బలమైన అభ్యర్థిగా ఉదయించారు.ఇక్కడ నుంచి పోటీలోకి దిగిన ఎస్సీ సామాజిక వర్గం మాల మహానాడు అధ్యక్షుడు జూపూడి ప్రభాకర్ ఘోరంగా పరాజయం పాలయ్యారు.
దాదాపు 5 వేల పైచిలుకు తేడా ఓట్లతో ఇక్కడ నుంచి డోలా విజయం సాధించారు.

ఇక్ అప్పటి నుంచి కూడా అభివృద్ధి అనే అంశం చుట్టూతానే కొండపి రాజకీయాలు తిరుగుతూ వచ్చాయి.దీనిని చంద్ర బాబు పలు మార్లు గుర్తించారు.అయితే, కొందరు కిట్టనివారు మాత్రం డోలాపై వ్యతిరేకంగా ప్రచారం చేయడంతో ఇక్కడ ఒకింత గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
అయితే, వాస్తవ పరిస్థితిని గమనించిన పార్టీ అధినేత చంద్రబాబు.స్వామిపై నమ్మకంతో ముందుకు వెళ్లారు.ప్రకాశం జిల్లాలో భారీ స్థాయిలో మెజారిటీని సాధించే స్థానం కూడా ఇదేనని నమ్మకంగా ఉన్నారు.ఈ క్రమంలోనే తాజాగా చంద్రబాబు ఈ టికెట్‌ను డోలాకు కన్ఫర్మ్ చేశారు.
వచ్చే ఎన్నికల్లో ఇక్కడ విజయం సాధించేలా ముందుకు దూసుకు పోవాలని దిశానిర్దేశం చేశారు.

ఇక,ఇదే సమయంలో డోలాపై ఒకింత అసమ్మతిగా ఉన్న నాయకులను కూడా చంద్రబాబు మందలించారు.అందరూ కలిసి పార్టీని అభివృద్ది చేయాలని దిశానిర్దేశం చేశారు.ముఖ్యంగా ఈ బాధ్యతలను ఒంగోలు ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ సోదరుడు దామచర్ల సత్యపై ఉంచారు చంద్రబాబు.
ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికలకు సంబంధించి దామచర్ల సత్య కూడా రంగంలోకి దిగేందుకు కృత కృత్యులయ్యారు.వచ్చే ఎన్నికల్లో కొండపిలో భారీ మెజారిటీని కైవసం చేసుకునే దిశగా చంద్రబాబు వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులకు ఈ ఇద్దరు నాయకులు కూడా చేతులు కలిపి.
ఉత్తమ ఫలితం రాబట్టుకునేందుకు రెడీ అవుతున్నారు.మరి ఈ దెబ్బతో ఇక్కడ టీడీపీ భారీ మెజారిటీ సాధిస్తుందని అంటున్నారు పరిశీలకులు
.






