రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది.ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పీక్స్‌కు తీసుకు వెళ్లింది.
ఎన్టీఆర్ జీవితంలో ఎదుర్కొన్న అత్యంత గడ్డు పరిస్థితులను తాను చూపించబోతున్నట్లుగా వర్మ మొదటి నుండి చెబుతూ వస్తున్నాడు.అన్నట్లుగానే చూపడం మొదలు పెట్టాడు.
ఈ చిత్రం విడుదలకు అడ్డంకులు సృష్టించేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని వర్మ ఆమద్య ట్వీట్ చేసిన విషయం తెల్సిందే.తాజాగా సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీకి సెన్సార్ సర్టిఫికెట్ రాకుండా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

నేరుగా చంద్రబాబు నాయుడు లేదంటే మరెవ్వరైనా రంగంలోకి దిగకుండా ఎవరికి అనుమానం రాకుండా పురందేశ్వరిని రంగంలోకి దించబోతున్నట్లుగా తెలుస్తోంది.పురందేశ్వరి ఇప్పటికే సెన్సార్ బోర్డు వారికి లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ మా మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉన్నాయి.అందుకే మొదట మాకు చూపించాలి.దానికి మేము ఓకే చెప్తే అప్పుడు సెన్సార్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లేఖ రాసిందట.దాంతో సెన్సార్ బోర్డు నుండి లక్ష్మీస్ ఎన్టీఆర్ బయటకు రావడం కష్టమే అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ విషయంలో చంద్రబాబు నాయుడు చాలా సీరియస్‌గా ఉన్నాడు.బయట పడకున్నా కూడా ఈ చిత్రంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడును వర్మ విలన్‌గా చూపించబోతున్నాడు అంటూ అందరికి తెలిసిన విషయమే.ఎలక్షన్స్ మరి కొన్ని వారాలు కూడా లేని ఈ సమయంలో వర్మ మూవీ విడుదల అయితే పరిస్థితి ఏంటీ అంటూ చంద్రబాబు చాలా ఆందోళనగా ఉన్నాడు.
మరి వర్మ ఎలాగైనా సినిమాను విడుదల చేయడం మాత్రం ఖాయం అంటున్నాడు.మరి వర్మను నందమూరి అండ్ నారా ఎలా ఎదుర్కొంటారో చూడాలి
.






