ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు.బీజేపీ వ్యతిరేక పార్టీల అధినేతలను కలుస్తూ.
ఆయన బిజీబిజీగా గడిపేస్తున్నారు.ముందుగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పనితీరుపై ఎన్డీయేతర పక్షాల భేటీలో ఆయన పాల్గొన్నారు.
కాన్సిస్ట్యూషన్ క్లబ్‌లో ‘సేవ్ ద నేషన్.సేవ్ ద డెమోక్రసీ’ పేరుతో కాంగ్రెస్, టీడీపీ, ఎన్సీపీ సహా యూపీఏ భాగస్వామ్య పక్షాలకు చెందిన నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా…రాహుల్ గాంధీ, శరద్ పవార్, చంద్రబాబు, గులామ్ నబీ ఆజాద్, శరద్ యాదవ్, రాజా, కనిమొళి వంటి కీలక నాయకులతో చర్చించారు.ఈ భేటీ ముగిశాక బాబు.జాతీయ నేతలతో భేటీ అవుతున్నారు.ఈ నేపథ్యంలోనే ఆయన కొద్దిసేపటి క్రితం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో భేటీ అయ్యి అనేక కీలక అంశాలు… రాబోయే పార్లమెంట్ ఎన్నికల గురించి చర్చించారు.







