అమెరికాలో ఘోరం..ఐదుగురు పిల్లలు మృతి

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు పిల్లలు అక్కడికక్కడే మ్రుతీ చెందారు.ఫ్లోరిడా జాతీయ రహదారిపై రెండు ఆయిల్ రిగ్గులు, రెండు వాహనాలు డీ కొట్టడంతో భారీగా మంటలు చెలరేగి ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు అంటున్నారు.

 Two Oil Rig Wans Accident In America-TeluguStop.com

అయితే ఐదుగురు చిన్నారులతో పాటు మరో ఇద్దరు కూడా మృతి చెందారు.అయితే ఈ సంఘటన ఎలా జరిగిందంటే.

ముందుగా ఓ ఆయిల్ రిగ్గు, ఓ వాహనం డీ కొట్టగా.ఇదే సమయంలో వెనుక నుంచి వస్తున్న మరో ఆయిల్ రిగ్గు, చర్చి వ్యాన్ కూడా ఢీకొనడంతో డీజిల్ మొత్తం నేలపాలైంది.దాదంతో ఒక్క సారిగా భారీగా మంటలు చెలరేగాయి.దీంతో చర్చి వ్యాన్‌లో ఉన్న ఐదుగురు చిన్నారులు, ఇరు వాహనాల డ్రైవర్ లు మృతి చెందారు.

ఇదిలాఉంటే ఈ చిన్నారులు లూసియానా నుంచి డిస్నీ వరల్డ్‌కు బయలుదేరారని ఇంతలోనే వారిని మృత్యువు కబలించిందని చెప్పారు.గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్టుగా అధికారులు తెలిపారు అయితే వీరిలో కొందరి పరిస్థితి మరీ విషమంగా ఉందని అంటున్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube