తెలంగాణాలో జరిగిన పోలింగ్ ఆ తరువాత విడుదలయిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అన్ని రాజకీయ పార్టీలను కలవరపెడుతున్నాయి.కొన్ని సంస్థలు తెలంగాణాలో టీఆర్ఎస్ పార్టీదే అధికారం అని ప్రకటించగా.
మరికొన్ని సంస్థలు మాత్రం కూటమిదే అధికారం అని ప్రకటించి గందరగోళంలో పెట్టాయి.ఇక టీఆర్ఎస్ పార్టీ నాయకులయితే ఒకడుగు ముందుకు వేసి మెజార్టీ మీద లెక్కలు వేసుకుంటూ… తామే మళ్ళీ అధికారంలోకి వస్తున్నామని ధీమాగా చెప్పుకుంటున్నారు.
కానీ ఈ విషయంలో కూటమిలోని పార్టీలు అదే స్థాయిలో ధైర్యంగా చెప్పలేకపోతున్నాయి.ఇక ఎగ్జిట్ పోల్స్ వెలువరించిన ఫలితాలు టీడీపీలో ఆందోళన పెంచుతున్నాయి.
తెలంగాణలో కూటమి కనుక అధికారం దక్కించుకోకపోతే.ఆ ప్రభావం రేపు ఏపీలో జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఉంటుంది అనే ఆందోళనలో కనిపిస్తోంది.

తెలంగాణాలో టీఆర్ఎస్ తిరిగి అధికారం చేపడితే కనుక ఏపీలో వైసిపి, జనసేన పార్టీలు స్పీడ్ పెంచేస్తాయి.ఇప్పటికే పరోక్షంగా ఆ రెండు పార్టీలు టీఆర్ఎస్ కి మద్దతు తెలిపాయి.ఇక అక్కడ కనుక మహాకూటమి అధికారాన్ని దక్కించుకుంటే…రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే ప్రభుత్వం ఒకే అభివృద్ధి అనే నినాదంతో తెలుగుదేశం దూసుకువెళ్ళే ఛాన్స్ లు ఉంటాయని అంచనా వేస్తున్నారు.ఇక తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టి రాజకీయం చేస్తున్నారంటూ ఇప్పటికే టీఆర్ఎస్ టీడీపీ పై గుర్రుగా ఉంది.
అంతే కాదు.మీరు మా రాష్ట్రంలోకి వచ్చారు కనుక మేము కూడా మీ రాష్ట్ర రాజకీయాల్లో వేలుపెడతాం అంటూ… ఇప్పటికే కేటీఆర్ వంటి నాయకులు హెచ్చరించారు.

అదే కనుక జరిగితే… చంద్రబాబు ని రాజకీయంగా… వ్యక్తిగతంగా విమర్శలు చేసి ఏపీలో తీరని నష్టం చేకూరుస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.ఈ పరిణామాలు కూడా బాబు ఆందోళనకు కారణం.అందుకే… పోలింగ్ పూర్తయిన వెంటనే తమ అభ్యర్థులతో బాబు టెలికాన్ఫిరెన్స్ పెట్టారు.ఏ ప్రాంతంలో ఓటింగ్ ఎలా జరిగింది.? కూటమి అభ్యర్థులు ఎంతమంది గెలవబోతున్నారు అనే విషయాలపై ఆరా తీసాడు.మరీ ముఖ్యంగా… కూకట్ పల్లి, ఖమ్మం నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల తీరు.
గెలుపు అవకాశాలపై చర్వహించారు.కూటమిలో పార్టీల సంగతి ఎలా ఉన్నా.
తెలుగుదేశం పార్టీ పోటీ చేసిన పదమూడు నియోజకవర్గాల్లో ఎన్ని సీట్లల్లో పార్టీ గెలవబోతున్నాయి అనే ఉత్కంఠ బాబులో కనిపిస్తోంది.
.






