కాలంతో పాటు మనం మారినప్పుడు మాత్రమే అభివృద్ది అనేది జరిగినట్లు.1980లలో ఎక్కువగా థియేటర్లు ఉండేవి కావు.దాంతో ఏదైనా ప్రకటనలు చేయాలన్నా, లేదంటే ఏదైనా ప్రదర్శించాలన్నా కూడా మొబైల్ థియేటర్లను వాడే వారు.అంటే రీల్ తిప్పుతూ ఏదైనా తెల్లని గోడపై లేదా తెల్లని పరదాపై బొమ్మలు వేసేవారు.
కాని ఇప్పుడు చిన్న చిన్న పట్టణాల్లో కూడా థియేటర్లు వచ్చాయి.దాంతో ఇప్పుడు అవి ఎక్కడ కూడా కనిపించడం లేదు.
దానికి తోడు టీవీలు రావడంతో మొబైల్ థియేటర్ల ఊసే లేదు.అయితే ఇప్పుడు మళ్లీ మొబైల్ థియేటర్ల సందడి మొదలైంది.
ప్రతి గ్రామంలో కూడా థియేటర్లు లేని కారణంగా అక్కడ ప్రజలు ఎంటర్‌టైన్‌మెంట్‌ను మిస్ అవుతున్నారు.అందుకే గ్రామ గ్రామన థియేటర్ ఉంటే బాగుంటుందనే అభిప్రాయంతో బాలీవుడ్ నిర్మాత సతీష్ కౌశిక్ మరియు వ్యాపారవేత్త సుశిల్ చౌదరి కలిసి మొబైల్ థియేటర్ల ఏర్పాటుకు సిద్దం అయ్యారు.మొదటి థియేటర్ ను దేశ రాజధాని దిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది.
దాదాపు ఆరు వేల అడుగుల వైశ్యాం కలిగిన ఈ కంటేనర్ మొబైల్ థియేటర్‌ను సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించారు.ఈ థియేటర్‌లో రేటు చాలా తక్కువ ఉంటుందని, కొత్త సినిమాలను ప్రదర్శిస్తున్నామని సతీష్ అంటున్నాడు.
పిక్చర్ టైం మల్టీప్లెక్స్ పేరుతో ఏర్పాటు అయిన ఈ మొబైల్ థియేటర్‌కు ప్రస్తుతం ఉత్తరాధిన భారీ డిమాండ్ ఉంది.ఎక్కడ ప్రజలు అయితే ముందుగా బుక్ చేసుకుంటారో అప్పుడు ఈ మొబైల్ థియేటర్ వెళ్తుంది.దాదాపుగా 150 మంది కూర్చునే వీలు ఉంటుంది.
అద్బుతమైన సౌండ్ సిస్టమ్స్‌తో పాటు ఏసీ కూడా ఈ మొబైల్ థియేటర్స్‌లో ఉంటుంది.ఆర్డర్ చేసిన కొన్ని గంటల్లోనే ఈ థియేటర్ మీ ఇంటికి వస్తుంది.కనీసం 60 మంది ఉంటే షో వేసేందుకు నిర్వాహకులు ఓకే చెప్తారు.ఈ మొబైల్ థియేటర్ల పద్దతి విదేశాల్లో ఉన్నప్పటికి ఇండియాలో మాత్రం ఈమద్య కాంలో బాగా ఫేమస్ అవుతున్నాయి.
ముందు ముందు సౌత్ ఇండియాలో కూడా ఈ మొబైల్ థియేటర్లు వస్తాయేమో లేండి.