హుజూర్‌నగర్ నియోజవర్గంలో ఈ రోజు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి సినీ నిర్మాత బండ్ల గణేశ్ ఆయన ప్రహారంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.
తెలంగాణ కాబోయే సీఎం ఉత్తమ్‌కుమార్ రెడ్డి అని సంచలన వ్యాఖ్యలు చేశారు.అక్కడితో ఆయన ఆగలేదు… ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు చేశారు.

రాష్ట్ర ప్రజలను మోసం చేసిన ఘనత కేసీఆర్ కుటుంబానిదేనని విమర్శించారు.రాష్ట్రాన్ని విభజిస్తే పార్టీ నష్టపోతుందని తెలిసి కూడా సోనియా తెలంగాణ ఇచ్చారని చెప్పారు.సీఎం అభ్యర్థిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని బండ్ల గణేష్ ప్రచారంలో ఓటర్లను కోరారు.







