చంద్రబాబు నాయుడుని ఎలా బుక్ చేద్దామా.?? రాజకీయంగా ఎలా దెబ్బ కొట్టాలా అని సిద్దంగా వేచి చూస్తున్న ప్రత్యర్దులకి మాంచి సమయం వచ్చింది.చంద్రబాబు ఆస్తులపై హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు అయ్యింది.బాబు ఆస్తులతో పాటు హెరిటేజ్ వ్యాపారాల్లో ఒక్క సారిగా గణనీయంగా ఆస్తుల పెరుగుదల జరిగిందంటూ రామారావు అనే న్యాయవాది ఈ నిన్నటి రోజున కోర్టులో పిటీషన్ వేశారు…దాంతో సర్వత్రా ఇప్పుడు కోర్టు నుంచీ ఎటువంటి తీర్పు వస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇదిలాఉంటే.

రోజు రోజు కి బాబు ఆస్తులుగాని హెరిటేజ్ ఆస్తులు కాని ఒక్క సారిగా పెరుగుదలకి రావడమనేది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయములో జరిగిందే ఈ విషయంపైనే వైసీపీ కూడా తీవ్ర ఆరోపణలు చేస్తోంది.లోకేష్ ప్రతీ ఏడాది ప్రకటిస్తున్న ఆస్తుల తాలూకు లెక్కల్ని ప్రతిపక్షం నిలదీస్తున్నా సరే లోకేష్ తన ముందున్న స్క్రిప్ట్ ప్రకారం వెళ్ళిపోతారు.ఇదిలాఉంటే ఆస్తుల్లో పెరుగుదల, హెరిటేజ్ సంస్ధల వ్యాపారాల్లో పెరుగుదలపై న్యాయవాది గట్టిగా పట్టుబట్టారని తెలుస్తోంది…
వ్యాపారాల్లో పెరుగుదల…కుటుంబ ఆస్తుల్లో పెరుగుదలపై సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ చేయాలంటూ ఆ పిటిషన్ లో పేర్కొనడం ఇప్పుడు రాజకీయ వర్గాలలో ఉత్ఖంతని రేపుతోంది.
అయితే చంద్రబాబు ఆస్తులపైన హెరిటేజ్ ఆస్తులపై కేసు వేసినంత మాత్రాన ఎదో జరిగిపోతుంది అని ఎవరూ అనుకోవడం లేదు కానే బాబు కి వ్యతిరేకంగా ఒక కేసు నమోదు అయ్యి ఉంటే అది ప్రస్తుత రాజకీయ పరిస్థితిలో.ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రతిపక్షాలకి ఓ ఆయుధంగా ఉపయోగ పడుతాయి.

గతంలో జరిగిన ఐటీ దాడులు, భూములు ఈమధ్య కూడా చంద్రబాబు పాలనలో అవినీతిని, ఐటి శాఖ కేటాయిస్తున్న భూముల విషయంలో భారీ కుంభకోణం జరిగిందంటూ శ్రవణ్ కుమార్ అనే మాజీ న్యాయమూర్తి కోర్టులో కేసు వేశారు.కాని ఆధారాలు లేని కారణంగా ఆ పిటిషన్ రిజక్ట్ అయ్యింది.మరి ఈ కేసు విషయంలో ఎలాంటి తీర్పు వెలువడుతుందో వేచి చూడాలి.మొత్తానికి బాబు ని ఇరికించడానికి ప్రతిపక్షాలు గట్టి పట్టే పడుతున్నట్టుగా తెలుస్తోంది అంటున్నారు విశ్లేషకులు.







