జనసేనక్ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆయన తల్లి అంజనాదేవి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు.అకస్మాత్తుగా జనసేన కార్యాలయానికి వెళ్లిన ఆమె జనసేన పార్టీకి తన వంతు సహాయంగా… 4లక్షల రూపాయల చెక్కుని పవన్‌కు అందజేశారు.
ఈ సందర్భంగా తన తల్లి పాదాలను మొక్కిన పవన్, ఆమె ఆశీస్సులను తీసుకున్నారు.అనంతరం తన తల్లితో కాసేపు ముచ్చటించారు.

ఈ సందర్భంగా తనను కలిసిన జనసేన పార్టీ ప్రతినిధులతో అంజనాదేవి మాట్లాడారు.పోలీస్ ఉద్యోగం ఎంతో శ్రమ, బాధ్యతతో కూడుకున్నదని అటువంటివారి కుటుంబాలకు అండగా నిలవాలని కుమారుడు పవన్‌ను అంజనాదేవి కోరారు.తన భర్త వెంకట్రావు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసినందువల్లే ఇప్పటికి తనకు పెన్షన్ వస్తోందని, ఆ పెన్షన్ డబ్బుతోనే ఇప్పుడు జనసేన పార్టీకి నాలుగు లక్షల రూపాయల విరాళాన్ని అందచేశానంటూ ఆనందం వ్యక్తం చేశారు.







