బస్సులో తన నడుముపై చెయ్యి వేసిన వ్యక్తికి ఆ యువతి ఎలా బుద్ది చెప్పిందో తెలుసా.? హ్యాట్సాఫ్ సిస్టర్.!

”ఆ రోజు కాలేజీకి సెల‌వులు ఇవ్వ‌డంతో ఇంటికి బ‌య‌ల్దేరా.మా సొంత ఊరు ఊటీ.

 Young Woman Facing A Incident In Bus Real Story-TeluguStop.com

నేను చ‌దివేది కోయంబ‌త్తూర్‌లో.కోయంబ‌త్తూర్ నుంచి ఊటీకి వెళ్లేందుకు 3 గంట‌లు ప‌డుతుంది.

అయితే బ‌స్సులుంటాయి కానీ, వాటిల్లో ర‌ద్దీ ఎక్కువ‌గా ఉంటుంది.ఎందులోనైనా ఒక సీట్ దొరికితే అది చాలా గొప్పే.

అలాంటి క్లిష్ట ప‌రిస్థితుల్లో ఓ బ‌స్సులో నాకు మూల‌న ఓ సీటు దొరికింది.అందులో అప్ప‌టికే ఓ పెద్దాయ‌న కూర్చుని ఉన్నాడు.

ఆయ‌న‌కు 50 సంవ‌త్స‌రాల వ‌యస్సు ఉంటుంద‌నుకుంటా.చూసేందుకు మా నాన్న ఏజ్‌లా అనిపించాడు.

సాధార‌ణంగా బ‌స్సుల్లో మ‌హిళ‌లు మ‌గ‌వారి ప‌క్క‌న కూర్చోరు.కానీ నేను అమ్మాయిని, అందులోనూ ఆ పెద్దాయ‌న‌కు నా తండ్రి వ‌య‌స్సు ఉంటుంది.క‌నుక ఎలాంటి అభ్యంత‌రం లేకుండా ఆయ‌న ప‌క్క‌న కూర్చున్నా.అయితే స‌డెన్‌గా కొంత సేప‌టి త‌రువాత నా భుజం మీద ఆ పెద్దాయ‌న చేయి వేయ‌సాగాడు.మొద‌ట ఏదో పొర‌పాటుగా వేశాడ‌నుకున్నా.కానీ కాదు, కావాల‌నే వేస్తున్నాడు.

ఆ త‌రువాత నేను ఏమీ అన‌క‌పోయే స‌రికి చేయి నా నడుం మీద వేయ‌డం మొద‌లు పెట్టాడు.ఇంక లాభం లేదు, ఏదో ఒక‌టి చేయాల‌నుకున్నా.

అయితే నేను లేచి పెద్దగా అరిచి అంద‌రికీ చెప్పి గొడ‌వ చేయ‌వ‌చ్చు.దీంతో అంద‌రూ అత‌ని భ‌ర‌తం ప‌డ‌తారు.కానీ అలా కాకుండా నేనే అత‌నికి బుద్ధి చెబుతామ‌నుకున్నా.వెంట‌నే హ్యాండ్ బ్యాగ్ వెతికా.అందులో ఒక సేఫ్టీ పిన్ క‌నిపించింది.దాన్ని తీసుకుని నా న‌డుంపై చేయి వేస్తున్న ఆ పెద్దాయ‌న చేతిని గుచ్చా.

అత‌ను చేతి వేయ‌డానికి య‌త్నించిన‌ప్పుడ‌ల్లా పిన్‌తో అత‌ని చేతిని గుచ్చా.దీంతో ఇక మ‌ళ్లీ అత‌ను ఆ ప‌ని చేసే ధైర్యం చేయ‌లేదు.

నిజంగా మ‌హిళ‌లంద‌రూ క‌నీసం ఈ సేఫ్టీ పిన్‌నైనా క‌చ్చితంగా వెంట తీసుకెళ్లండి.అది క‌చ్చితంగా ఇలాంటి ఏదో ఒక స‌మ‌యంలో ప‌నికొస్తుంది.”

— శ‌ర‌ణ్య ర‌విచంద్ర‌న్ అనే ఓ యువ‌తికి బ‌స్‌లో ఎదురైన సంఘ‌ట‌న ఇది.రియల్ స్టోరీ.!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube