కాజల్‌ను కాదని సమంత వద్దకు వచ్చిన శూర్పణక

టాలీవుడ్‌లో నిన్న మొన్నటి వరకు స్టార్‌ హీరోయిన్‌గా వెలుగు వెలిగిన కాజల్‌ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే.ఈఅమ్మడు చిన్న హీరోలతో సినిమాలు చేస్తూ కెరీర్‌ నెట్టుకు వస్తుంది.

 The Surpanaka Movie Goes Under Actress Samanthas Hand-TeluguStop.com

తెలుగులో ఈమె నటించిన సినిమాలు సక్సెస్‌లు దక్కించుకుంటున్నా కూడా ఈమె మాత్రం పెద్దగా స్టార్స్‌ సినిమాలో ఛాన్స్‌ను దక్కించుకోలేక పోతుంది.తాజాగా ఈమె ఒక లేడీ ఓరియంటెడ్‌ సోషియో ఫాంటసీ సినిమా ఛాన్స్‌ను దక్కించుకుంది.

దర్శకుడు భార్గవ్‌ దర్శకత్వంలో శూర్పణక కథాంశంతో కాజల్‌ హీరోగా ఒక చిత్రం తెరకెక్కబోతున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెల్సిందే.

వచ్చే ఏడాది ఆరంభంలో కాజల్‌తో శూర్పణక చిత్రాన్ని ప్రారంభించబోతున్నట్లుగా దర్శకుడు భార్గవ్‌ సన్నిహితుల వద్ద చెప్పుకొచ్చినట్లుగా ప్రచారం జరిగింది.అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో కాజల్‌కు బదులుగా సమంతను ఎంపిక చేసే విషయమై దర్శకుడు భార్గవ్‌ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.కాజల్‌ కంటే సమంతకు తెలుగు మరియు తమిళంలో ఫాలోయింగ్‌ ఎక్కువ ఉందని, రెండు భాషల్లో సినిమాకు మంచి బిజినెస్‌ అవ్వాలంటే సినిమాను సమంతతో చేయాలని ఆయన భావించినట్లుగా సమాచారం అందుతుంది.

మరో వైపు సమంత కీలకమైన పాత్రలో కనిపించనుండగా, కాజల్‌ సెకండ్‌ హీరోయిన్‌గా కనిపించబోతుందనే వార్తలు కూడా వస్తున్నాయి.మొత్తానికి శూర్పణక చిత్రం కాజల్‌ చేజారిందనే ప్రచారం మాత్రం బలంగా వినిపిస్తుంది.సమంత రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతుంది.రామాయణ కాలంలోని శూర్పణక పాత్రతో పాటు అల్ట్రా మోడ్రన్‌ అమ్మాయిగా ఈ చిత్రంలో సమంత కనిపించబోతుందని సమాచారం అందుతుంది.వచ్చే ఏడాది ఆరంభంలో సినిమాను పట్టాలెక్కించి, అదే ఏడాది చివరికి సినిమాను పూర్తి చేసి, 2020లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని దర్శకుడు భార్గవ్‌ నిర్ణయించుకున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube