తెలంగాణాలో టీఆర్ఎస్ పార్టీకి అధికారం దక్కకుండా చేసేందుకు కాంగ్రెస్ పార్టీ రకరకాల ఎత్తుగడలు వేస్తోంది.ఇప్పున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీని బలహీనపరచాలంటే ఆ పార్టీలో అసమ్మతి నాయకులను, పార్టీ నుంచి బయటకి వచ్చినవారిని బుజ్జగించి తమ పార్టీలో చేర్చుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది.
టీఆర్ఎస్‌ను ఎదుర్కునేందుకు కలిసివచ్చే అన్ని అవకాశాలను తమకు అనుకూలంగా మార్చుకుంటోంది కాంగ్రెస్.

ఇప్పటికే టీఆర్ఎస్ లో ఉన్న అసమ్మతి నాయకులు త్వరలోనే కాంగ్రెస్ గూటికి చేరనున్నారనే ప్రచారం జరుగుతోంది.ఈ నెల రాహుల్ పర్యటన సందర్భంగా.టీఆర్ఎస్‌లోని పలువురు నేతలను, కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
తమకు బలమైన అభ్యర్ధులు లేని ప్రాంతాల్లో టీఆర్ఎస్ లోని అసమ్మతి నాయకులకు గాలం వేస్తోంది కాంగ్రెస్.టికెటు ఖాయమనే హామీ ఇచ్చేసరికి.నేతలు సైతం కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి రెడీ అయిపోతున్నారు.రంగారెడ్డి జిల్లా నుంచి ఓ సిట్టింగ్ ఎంపీ.
ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి పలువురు కీలక నేతలు ఇప్పటికే క్యూలో ఉన్నట్టు తెలుస్తోంది.

ఇక టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన రాములు నాయక్.ఆ పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.టీఆర్‌ఎస్ లో ప్రజాస్వామ్యం, ఆత్మగౌరవం లేదని, అదో ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా తయారైపోయిందని ఆరోపించారు.
షోకాజ్ నోటీసు ఇవ్వకుండానే తనను సస్పెండ్ చేశారని రాములు నాయక్ కన్నీళ్లు పెట్టుకున్నారు.పీసీసీ నేతలు మంగళవారం ఢిల్లీకి వెళ్లి, రాహుల్ తో చర్చించి.వలస నేతల జాయినింగ్స్ పై క్లారిటీ తీసుకునే అవకాశం ఉంది.తమ పార్టీలోకి భారీ వలసలు ఉంటాయని.
ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వీరి చేరికపైనే అనే చర్చ కూడా కాంగ్రెస్లో జరుగుతోంది.అయితే వీలైనంతవరకు పార్టీ నాయకులు చేజారిపోకుండా టీఆర్ఎస్ తమ పార్టీలోని అసంతృప్తులను బుజ్జగించే పనిలో ఉంది.