టీఆర్ఎస్ లో మూకుమ్మడి రాజీనామాలు - ఆందోళన కేసీఆర్

తెలంగాణలో ముందస్తు వేడి ఇంకా కాగుతూనే ఉంది.గతంలో తెలంగాణా ప్రజలు ఇలాంటి రాజకీయాల్ని చూసి ఉండరు కూడా ఒక పార్టీని మించి మరొక పార్టీ చేపడుతున్న వ్యూహ ప్రతి వ్యూహాలు నేతలని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.

అందరికంటే ఎక్కువగా మేమే బలవంతులం అనుకున్న టీఆర్ఎస్ బలుపు ఒక్క సారితో కరిగిపోయిందట.అసెంబ్లీని రద్దు చేసేసి ఒక్క సారిగా ఎన్నికలకి సిద్దం అని ప్రకటించేసిన కేసీఆర్ అక్కడితో ఆగిపోయి ఉంటే బాగుండేది కానీ.

మాకంటే తోపులు ఎవరూ లేరిక్కడ అనేట్టుగా అన్ని పార్టలకంటే ముందుగానే పార్టీ తరపున పోటీ చేయబోయే 105 పేర్ల జాబితా కూడా ప్రకటించేశాడు.ఈ ప్రకటనతో పార్టీ కి సూపర్ హైప్ క్రియేట్ అవుతుందని అనుకున్నాడు కేసీఆర్ అయితే ఆ అభ్యర్థుల లిస్ట్ ప్రకటన తరువాత టీఆర్ఎస్ లో అసంతృప్తుల అగ్ని జ్వాలలు ఎగిసి పడుతున్నాయి.కేసీఆర్ కి బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యిందని తెగ సంతోష పడుతున్నాయి ప్రత్యర్ధి పార్టీలు.

అసలుకే మోసం వచ్చిందని తెగ చంకలు గుద్దుకుంటున్నారు.ఇంతకీ ఏమి జరిగిందంటే.

Advertisement

ముందస్తు ఎన్నికలకు పక్కా వ్యూహాలతో దూసుకెళ్తున్నటీఆర్ఎస్ పార్టీకి.రాజీనామాల సెగ మొదలయ్యింది.

తొలి జాబితాలో తమ పేర్లు లేని నేతలు.ఇప్పటి వరకు నిరసన ప్రదర్శనలకు దిగారు అంతేకాదు పార్టీ కి మీకు ఒక దణ్ణం అంటూ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు.

టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో మంది ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున పార్టీలో చేరారు వారికి అప్పట్లో హామీలు కూడా ఇచ్చారు.ఈ క్రమంలోనే అసెంబ్లీని రద్దు చేసిన సీఎం ఒకేసారి 105 మంది అభ్యర్థులను ప్రకటించి ఆశావాహులు అందరికి కేసీఆర్ షాక్ ఇచ్చారట.

అయితే ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలతో పేర్లు లేని టీఆర్ఎస్ ఆశావాహులు పార్టీకి గుడ్ బాయ్ చెప్తున్నారు.ఈ లిస్టు లోనే కొండా దంపతులు ఉండగా ఇదిలాఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో పోటి చేసేందుకు అవకాశం దక్కుతుందని టిడిపి నుంచి మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ అధికార పార్టీ చెంతకి చేరి టిక్కెట్ రాలేదని చెప్పి సొంత గూటికి చేరారు.మెదక్ జిల్లా ఆందోల్ స్థానం దక్కకపోవడంతో అల్లాదుర్గం జడ్పీటీసి పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
ఏపీలో పేదల పథకాలకు బాబే అడ్డు పడుతున్నారా.. ఆ ఫిర్యాదులే ప్రజల పాలిట శాపమా?

ఇలా పార్టీలో ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఒక్కో కారణంతో బయటకి వెళ్ళిపోయి కేసీఆర్ ని ఒంటరిని చేయాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు