పవన్‌ ఆదుకోలేక పోయాడు.. చైతూ ఆదుకుంటాడా..

చిన్న చిత్రాలతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన అను ఎమాన్యూల్‌కు అనుకోని అవకాశంగా పవన్‌ కళ్యాణ్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అజ్ఞాతవాసి’ చిత్రంలో ఛాన్స్‌ను దక్కించుకుంది.ఆ చిత్రం అట్టర్‌ ఫ్లాప్‌ అవ్వడంతో అను ఎమాన్యూల్‌ ఆశలన్నీ అడియాశలు అయ్యాయి.

 Sailaja Reddy Alludu Movie Releasing On This Month Of 13th-TeluguStop.com

ఆ తర్వాత మరో మెగా హీరో అల్లు అర్జున్‌తో ఈ అమ్మడు ‘నా పేరు సూర్య’ చిత్రంలో నటించింది.ఆ చిత్రం కూడా అనూ ఎమాన్యూల్‌కు నిరాశ మిగిల్చింది.

దాంతో అను ఎమాన్యూల్‌కు ఐరెన్‌ లెగ్‌ అనే ముద్ర పడటం జరిగింది.

వరుస ఫ్లాప్‌ల కారణంగా వచ్చిన అవకాశాలు కూడా చేజారి పోయాయి.రవితేజ, శ్రీనువైట్ల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ చిత్రంలో మొదట హీరోయిన్‌గా అను ఎమాన్యూల్‌ను అనుకున్నారు.కాని అనును తొలగించి ఆ తర్వాత ఇలియానాను ఎంపిక చేయడం జరిగింది.

ఇలియానా అయితే సినిమాకు క్రేజ్‌ పెరుగుతుందని వారు భావించారు.ఈ సమయంలోనే ఈమె ఆశలన్నీ ‘శైలజ రెడ్డి అల్లుడు’ చిత్రంపై ఉన్నాయి.

మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నాగచైతన్య హీరోగా నటించగా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటించింది.

వరుసగా సక్సెస్‌లను దక్కించుకుంటూ వస్తున్న దర్శకుడు మారుతి ఈ చిత్రంతో మరోసారి విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు నమ్మకంతో ఉన్నారు.

ఖచ్చితంగా సినిమా విజయాన్ని దక్కించుకుంటుందనే అక్కినేని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇలాంటి సమయంలో శైలజరెడ్డి అల్లుడి ఈనెల 13న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే.

వరుసగా పరాజయాలు వచ్చిన కారణంగా అను ఎమాన్యూల్‌ ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకుంది.ఈ చిత్రం సక్సెస్‌ అయితేనే తప్ప అను కెరీర్‌ ముందుకు వెళ్తుంది.అను ఎమాన్యూల్‌ చేతిలో ప్రస్తుతం పెద్ద సినిమాు ఏమీ లేవు.దాంతో ఈ చిత్రం సక్సెస్‌ అందరి కంటే ఆమెకు ఎక్కువ అవసరం అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.

మెగా హీరోలు ఈమెకు సక్సెస్‌ను ఇవ్వలేక పోయారు, కనీసం నాగచైతన్య అయినా ఈమె కెరీర్‌ను నిలబెడుతాడా అనేది చూడాలి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube