హీరోగా దక్కని సక్సెస్‌ దర్శకుడిగా వచ్చింది.. బిజీ కాబోతున్నాడు

‘అందాల రాక్షసిలి’ చిత్రంలో రాహుల్‌ రవీంద్రన్‌ మరియు నవీన్‌ చంద్రలు హీరోలుగా నటించారు.ఆ చిత్రంలో నవీన్‌ చంద్ర మాస్‌ లుక్‌తో కనిపించగా, రాహుల్‌ రవీంద్రన్‌ చాలా క్లాసీగా, తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా కనిపించాడు.

 Rahul Ravindran Wants To Direct In Movies-TeluguStop.com

రాహుల్‌ రవీంద్రకు నటుడు అయ్యే లక్షణాలు చాలా ఉన్నాయని, తెలుగులో హీరోగా సెటిల్‌ అవుతాడు అంటూ అంతా అనుకున్నారు.కాని అనూహ్యంగా రాహుల్‌ రవీంద్రన్‌ తెలుగులో నటించిన ఏ ఒక్క సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.

శ్రీమంతుడు చిత్రంలో ఈయన పోషించిన క్యారెక్టర్‌ ఆర్టిస్టు పాత్రకు మంచి గుర్తింపు దక్కింది.

శ్రీమంతుడు చిత్రం తర్వాత మళ్లీ రాహుల్‌ రవీంద్రన్‌ నటుడిగా కొనసాగే పరిస్థితి కనిపించలేదు.చేసిన సినిమాలు ఫ్లాప్‌ అవుతున్న నేపథ్యంలో దర్శకత్వం వైపుకు సిద్దం అయ్యింది.తాజాగా ఈయన ‘చి.ల.సౌ.’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.అక్కినేని ఇంటి హీరో సుశాంత్‌తో రాహుల్‌ రవీంద్రన్‌ తెరకెక్కించిన ఈ చిత్రం మంచి టాక్‌ను దక్కించుకుంది.

క్లాస్‌ ఆడియన్స్‌కు విపరీతంగా నచ్చిన ఈ చిత్రం అన్ని ఏరియాల్లో కూడా ఒక మోస్తరు కలెక్షన్స్‌ను రాబడుతున్నట్లుగా టాక్‌ వినిపిస్తుంది.

హీరోగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా సక్సెస్‌ను దక్కించుకోవడంలో విఫలం అయిన రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకుడిగా మొదటి సినిమాతోనే సక్సెస్‌ను దక్కించుకోవడం జరిగింది.

యూత్‌ ఆడియన్స్‌ అభిరుచికి తగ్గట్లుగా ఈయన సినిమా చేయడంతో పాటు మంచి స్క్రీన్‌ప్లేను కూడా ఈ చిత్రంలో చూపించడంతో విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి.చిలసౌ సూపర్‌ హిట్‌ టాక్‌ను దక్కించుకున్న నేపథ్యంలో రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో మరో సినిమాను నిర్మించేందుకు అన్నపూర్ణ స్టూడియోస్‌ అధినేత నాగార్జున సిద్దం అయ్యాడు.

నాగచైతన్య కోసం స్క్రిప్ట్‌ సిద్దం చేయాల్సిందిగా రాహుల్‌కు సూచించినట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం నాగచైతన్య కమిట్‌ అయిన మూవీస్‌ పూర్తి అవ్వడమే ఆలస్యం సినిమాను రాహుల్‌తో చేయాలని ఫిక్స్‌ అయ్యాడు.రెండు మూడు స్టోరీ లైన్స్‌ ఉన్నాయని, వాటిల్లో ఒకదాన్ని చైతూ ఫైనల్‌ చేస్తే స్క్రిప్ట్‌ను రాహుల్‌ సిద్దం చేయబోతున్నాడు.మొత్తానికి మొదటి సినిమాతో దర్శకుడిగా సక్సెస్‌ అయిన రాహుల్‌ అప్పుడే రెండవ ఆఫర్‌ దక్కించుకున్నాడు.

దాంతో హీరోగా కంటే దర్శకుడిగా రాహుల్‌ బిజీ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube