ఈ మధ్య కాలంలో ఫిట్‌నెస్’ చాలెంజ్, గ్రీన్ ఛాలెంజ్‌లు ఉద్యమంగా మారాయి.ప్రజలలో మార్పు కలిగించేందుకు సవాళ్ళు విసురుతున్నారు.
తాజాగా మరో ఛాలెంజ్ వచ్చింది.అదేమిటంటే… ప్రముఖ సింగర్ డ్రేక్ పాడిన ‘ ఇన్ మై ఫీలింగ్స్’ పాట విపరీతంగా పాపులర్ అవ్వడంతో హాలీవుడ్ నటుడు షిగ్గి ‘కికి ఛాలెంజ్’ పేరుతో ఓ ఛాలెంజ్ విసిరాడు.
దీంతో అంతర్జాతీయ స్థాయి నుంచి సినీ నటులు ,యువత ఈ కిక్ ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నారు.ఈ ఛాలెంజ్ ప్రకారం…‘ కదులుతున్న కారు నుంచి కిందకి దిగి కారు నిదానంగా కదులుతుండగా దానితో పాటు డ్యాన్స్ చేసి మళ్లీ కారులోకి రావడమే’.
ఈ ఛాలెంజ్‌ని పోలీసులు వ్యతిరేకిస్తూ, ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా ‘కికి చాలెంజ్’ స్వీకరించే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది.ముఖ్యంగా సినీ నటులు , క్రీడాకారులు ఈ ఛాలెంజ్ స్వీకరించి అనురించడంతో అసలు తంటాలు మొదలవుతున్నాయి.
ఇటీవలే ఈ సాంగ్ కు ఆదా శర్మ, రెజీనా కెస్సన్ద్రాలు డాన్స్ చేసిన విషయం అందరికి తెలిసిందే.ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి ఎన్నో లైక్స్ సంపాదించారు.
అయితే, #InMyFeelingsChallenge పేరుతో ట్రెండవ్వుతున్న ప్రమాదకర ఛాలెంజ్‌లు ప్రాణాలు తీయడమే కాకుండా, ఇతరులకు ప్రాణాంతకమే.ఈ నేపథ్యంలో ఢిల్లీ, ముంబయి, ఉత్తరప్రదేశ్, జైపూర్ పోలీసులు తమ అధికారిక సోషల్ మీడియా ద్వారా పౌరులకు పలు హెచ్చరికలు జారీ చేశారు.
ఢిల్లీ పోలీసులు పోస్ట్ చేసిన ట్వీట్‌లో ‘‘మీరు కారు డోర్లు తెరిచి రోడ్లపై డ్యాన్సులు చేస్తే మీ కోసం కొత్త డోరులు తెరుచుకుని ఉంటాయి’’ అంటూ డోరు తెరిచి ఉన్న అంబులెన్స్ ఫొటోను పోస్ట్ చేశారు.‘‘ఇలా డోర్లు తెరిచి డ్యాన్సులు చేయడం మీ ఒక్కరినే కాదు.
ఇతరులను కూడా ప్రమాదంలోకి నెట్టినట్లే’’ అని పేర్కొంటూ ముంబయి పోలీసులు ఓ వీడియో పోస్ట్ చేశారు.ఈ నేపథ్యంలో ఈ ఛాలెంజ్ స్వీకరించకపోవడమే ఉత్తమం.