ఏపీ ముఖ్యమంత్రి గా చంద్రబాబు ఉండటమే మన అదృష్టం ఆహా ఓహో అంటూ డబ్బాలు కొట్టిన పవన్ కళ్యాణ్ ఒక్క సారిగా ప్లేట్ ఫిరాయించడం పై ఏన్నో అనుమానాలు మరెన్నో ఆసక్తికరమైన కధనాలు వెలువడ్డాయి పవన్ బిజేపీ పార్టీకి భయపడ్డాడని పెన్ డ్రైవ్ వ్యవహారం పవన్ కొంప ముంచిందని అందుకే కేంద్రానికి పవన్ కట్టు బానిస అయ్యాడని టాక్ వినిపించింది అయితే అంతా సమసి పోయి ఈ వ్యాఖ్యలు మాసిపోయిన సమయంలో మళ్ళీ జేసీ దివాకర్ రెడ్డి తనయుడు ఒక బాంబు పేల్చాడు.పవన్ పై సంచలన కామెంట్స్ చేశాడు.
గుంటూరు బహిరంగ సభ సమయంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరుకు అనంతరం ఆయన స్పందించిన తీరుకు స్పష్టమైన తేడా ఉందని పవన్ రెడ్డి వ్యాఖ్యానించారు.ఆ సమయంలో ఏం మాట్లాడారో అందరికీ తెలుసునని అయితే హఠాత్తుగా ఆయన యూటర్న్ తీసుకున్నారని చెప్పారు.
అయితే ముందు రోజు వరకూ బాగానే ఉన్న పవన్ కళ్యాణ్ ఒక్క సారిగా ఆ సభా వేదికపై నుంచీ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ కి కారణం ఓ ఫోన్ కాల్ అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో అనంతపురం నుంచే పోటీ చేస్తాను అంటున్నాడు అసలు అతడి పార్టీకి పట్టుమని పది సీట్లు కూడా రావు తన అన్న కి రెండు అంకెలు వస్తే ఇతడికి ఒక అంకె పై సీట్లు వస్తాయని ఎద్దేవా చేశారు.కనీసం ఆ పార్టీలో పోటీ చేసేందుకు అభ్యర్ధులు కూడా లేకపోవడం అందరికి తెలిసిందే ఇక అతడు ఏమి చేయగలదు అంటూ ఫైర్ అయ్యారు…అధికార టీడీపీ – ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల నుంచి టిక్కెట్లు ఆశించి – వాటిని దక్కించుకోలేని వారు వచ్చే ఎన్నికల సమయంలో జనసేనలోకి వెళ్తారని ఎద్దేవా చేశారు.
పవన్ కళ్యాణ్ రెండు పడవలపై కాళ్ళు పెడుతున్నారని.
అలాగే రెండు నాల్కులతో మాట్లాడుతున్నాడని అందుకే ముందు చంద్రబాబు పై ప్రసంసలు కురిపించిన పవన్ ఇప్పుడు చంద్రబాబు ని విమర్సిస్తున్నాడని దీనికి వెనుక కధ స్క్రీన్ ప్లే దర్శకత్వం అంతా మోడీ, షా లేలని ఎద్దేవా చేశారు.పవన ని నమ్మే పరిస్థితిలో ఏపీ ప్రజలు ముఖ్యంగా అనంతపురం ప్రజలు లేరని ఆయన స్పష్టం చేశారు.







