ఏపీ సీఎం చంద్రబాబు స్టయిలే వేరు .ఆయన్ను ఎన్నిరకాలుగా ఇరుకునపెట్టే విషయాల గురించి అడిగినా ఆయన మాత్రం ఏ మాత్రం కంగారు పడరు.
ఆయన చెప్పాలి అనుకున్నదే చెప్తారు తప్ప అడిగినదానికి మాత్రం సమాధానం చెప్పరు.ఇదే బాబు స్టయిల్ .ప్రతిపక్షాలు విమర్శించినట్టుగానే ఆయన ఎప్పుడూ రెండుకళ్ల సిద్ధాంతాన్నే ఫాలో అవుతుంటారు.ఇదే ఆయనకు ఉన్న ప్లస్ అండ్ మైనెస్.
ఒకప్పుడు రాష్ట్ర విభజన విషయంలోనూ ఆంధ్రాలో సమైక్యాంధ్రా అంటూనే రాష్ట్రాన్ని విభజించాలని కేంద్రానికి లేఖ రాస్తారు.ఇక్కడేమో సమైక్యాంధ్ర కోసం పోరాడమని చెప్తారు.
తెలంగాణకెళ్తే.నేనిచ్చిన లేఖ వల్లే తెలంగాణ వచ్చిందంటారు.
ఇలా ఎక్కడికక్కడ ప్లేట్ ఫిరాయించడం బాబుకు ముందు నుంచి ఉన్న అలవాటే.

బీజేపీతో తెగతెంపులు చేసుకున్నాక కూడా బాబు ఇలాగే వ్యవహారం నడుపుతున్నాడు.లోకల్ మీడియాతో బీజేపీపై నిప్పులు చెరుగుతున్న ఆయన జాతీయ మీడియా విషయాకొచ్చేసరికి చల్లబడి పోతున్నారు.అసులు బీజేపీతో పొత్తు కొనసాగుతుందా అని ఏ విలేకరి అయినా.
ప్రశ్నిస్తే.పొంతన లేకుండా సమాధానం చెప్తారు.
కానీ, బీజేపీతో మాత్రం తెగదెంపులు చేసుకున్నామని మాత్రం చెప్పరు.కానీ కర్ణాటకలో బీజేపీ కి నావల్లే ఈ పరిస్థితి తలెత్తింది అని గొప్పగా మాత్రం చెప్పుకుంటున్నాడు.
తాజాగా నిన్న సాయంత్రం కర్ణాటక 24వ ముఖ్యమంత్రిగా జేడీఎస్ అధినేత హెచ్ డీ కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేశారు.ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, యూపీ మాజీ సీఎం, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పశ్చిబంగా, ఢిల్లీ సీఎంలు మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, బీఎస్పీ నేత మాయవతి తదితరులతో భేటీ అయ్యారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
కర్ణాటకలో ప్రాంతీయ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు.భవిష్యత్ లో తాము ప్రాంతీయ పార్టీలతో కలిసి ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు.
మమతా బెనర్జీతో మోదీకి వ్యతిరేక ప్రంట్ గురించి మాట్లాడారా? అని విలేకరులు ప్రశ్నిస్తే బాబు మాట దాటవేశారు.ప్రాంతీయ పార్టీలు అన్నీ ఇక్కడ ఉన్నాయని, కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారని ఇది చాలా ముఖ్యమైన అంశమని అంటూ పొంతన లేకుండా సమాధానం ఇచ్చారు.
అలాగే టీడీపీ, సోనియా రాహుల్ గాంధీలతో కలిసి వెళ్తుందా అని ప్రశ్నించగా.ప్రాంతీయ పార్టీ నేత కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి వచ్చామని, ఆయన చెప్పాలనుకున్నదే చెప్పారు.బాబు వ్యవహారం చూస్తుంటే అసలు నిజంగా బీజేపీతో తెగతెంపులు చేసుకున్నారా.? లేక ఎన్నికల ఎత్తుగడల్లో ఇది కూడా ఒక భాగమా అనేది మాత్రం ఇప్పుడు అందరిలో ఉన్న డౌట్ .ఎవరు ఎన్ని అనుకున్నా బాబు మాత్రం దేనిమీద ఒక క్లారిటీ ఇవ్వడు కదా !
.






