జగన్ పాదయాత్ర దూసుకు పోతోంది.ఒక పక్క పక్కా ప్రణాళికగా.
ప్రజలని హామీల ఉయ్యాలా ఊగిస్తూ వారితో జే జే లు కొట్టించుకుంటున్న జగన్ రెడ్డి ప్రజల నుంచీ వస్తున్నా రెస్పాన్స్ చూసి ఉబ్బి తబ్బిబ్బు అవుతున్నాడు.సక్సెస్ ఫుల్ గా సాగిపోతున్న పాదయత్రకి చంద్రబాబు మోకాలు అడ్డు పెట్టి ఆపాలని చూస్తున్నా జగన్ ఎగిరి దాటుకుని వెళ్తున్నాడు.
ఒక పక్క వైసీపి నాయకులని సైకిల్ ఎక్కిస్తుంటే జగన్ ఎటువంటి భయం లేకుండా యాత్ర సాగించేయడం బాబుకి మింగుడు పడటం లేదు.అందుకే ఇప్పుడు బాబు ఒక అస్త్రాన్ని ప్రయోగించబోతున్నాడు
వైసీపి వాళ్ళని తమవైపు తిప్పుకుని జగన్ ని మానసికంగా ఇబ్బంది పెట్టాలని చూసినా సరే అది తమకే నష్టం అని చాలా లేటుగా తెలుసుకున్న చంద్రబాబు.
సుదీర్ఘ ఆలోచన తరువాత జగన్ అవినీతి కేసులపై కన్నేశాడు.వైసీపీ అధినేత జగన్‌పై ఉన్న కేసులకు సంబంధించిన అంశాన్ని మళ్లీ జనంలోకి తీసుకెళ్లాలని టీడీపీ నిర్ణయించినట్టు తెలుస్తోంది.
త్వరలో జైలుకు వెళ్లబోయే ఆయనతో ప్రజలు, ఆ పార్టీ కార్యకర్తలు ఉంటారా అనే ప్రశ్నలతో జనంలోకి వెళ్లాలని టీడీపీ అధినేత చంద్రబాబు సొంత పార్టీ నాయకులకు సూచించారు.ఈ విషయంలో పార్టీ నేతలకు పలు కీలకమైన సూచనలను చంద్రబాబు చేశారని వార్తలు వినిపిస్తున్నాయి
ఈడీ టాప్ లిస్టులో జగన్‌తో పాటు మహారాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం ఛగన్ భుజబల్ పేర్లు ఉన్నాయంటూ జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఎన్నో కంపెనీల ద్వారా సుమారు 368 కోట్లు మనీ లాండరింగ్‌కు జగన్ పాల్పడినట్లు అందులో తెలుస్తోంది.ఇందులో ఇద్దరు ఇప్పటికే జైలుకు వెళ్లారు.
జాతీయ మీడియాలో వస్తున్న ఆ కథనాలను బట్టి ఇక జగన్ కూడా జైలుకు వెళ్లేరోజు ఎంతో దూరంలో లేదనిపిస్తోందని చంద్రబాబు ఫిక్స్ అయ్యారు.ఇదే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని బాబు పధక రచన చేశారు
జగన్ పై ఇక అడ్డదిడ్డంగా మాట్లాడకుండా ప్రజలకి అర్థం అయ్యేలా ఈ విషయాలని తెలియచేస్తే చాలు ఇంతకూ మించి మనం ఏమి చేయవలసిన అవసరం లేదు అని చెప్పారట బాబు.
ఎక్కడ ఎటువంటి ఆర్ధిక నేరం జరిగినా జగన్ పేరు వాటిలో బయటకి రావడం ఇప్పుడు తెలుగుదేశానికి కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు తెలుగు దేశం నాయకులు.మరి చంద్రబాబు వేస్తున్న ఈ ప్లాన్ కి జగన్ కౌంటర్ ప్లాన్ కూడా సిద్దం చేస్తున్నాడని సమాచారం
.






