వైఎస్ ఆత్మకి సూరీడు షాక్ ఇస్తాడా..

వైఎస్సార్ కుటుంభానికి నమ్మిన భంటు సూరీడు.

వైఎస్ కి చిన్ననాటి స్నేహితుడు వైఎస్ ఆత్మగా పిలువబడే వ్యక్తి కేవీపి రామచంద్రరావు ఇద్దరు కూడా వైఎస్ బ్రతికునప్పుడు వారి వారి స్థాయిలో గుర్తుంపు పొందినవారే.

వైఎస్ఆర్ చనిపోయిన తరువాత సూరీడు వైఎస్ కుటుంభానికి దూరం అయ్యాడు.వైఎస్ చ‌నిపోయిన దాదాపు ఎనిమిదేళ్ల త‌ర్వాత ఈ ఇద్ద‌రి మధ్యా చాలా గ్యాప్ వచ్చినట్టుగా తెలుస్తోంది.

కేవీపీపై సూరీడు చాలా కోపంగా ఉన్నాడట.ఏమి జరిగిందో ఏమో కానీ.

వైఎస్ ఆత్మ పై సూరీడు సీబీఐ కోర్టుకు ఫిర్యాదు చేయ‌నున్నాడ‌ట‌.ఈ వార్త విని కేవీపి అండ్ కో షాక్ లో ఉందని సమాచారం.

Advertisement

ఇదే వార్తా ఇప్పుడు సంచలనం రేపుతోంది.సిబిఐ కోర్టులో ఇప్పటికే జగన్ అక్రమాస్తుల కేసులో అనేక కేసులు ఎదుర్కొంటున్నారు.

తన తండ్రి బ్రతికున్న సమయంలో అధికారాన్ని ఉపయోగించి క్విడ్ ప్రోకో కేసులో భారీగా ఆస్తులు కూడబెట్టాడు అనేది సిబిఐ ఆరోపణ.ఇదే విషయంలో సూరీడుని విచారించినా అప్పట్లో సైలెంట్ గాఉన్నాడు కాని నోరు తెరవలేదు.

ఇప్పుడు సూరీడు చాలా రోజుల తరువాత నోరు తెరువబోతున్నాడు అని తెలుస్తోంది.అంతేకాదు కోర్టుకు స్వయంగా వెళ్లి కేవిపిపై ఆరోపణలు చేయడానికి సిద్దంగా ఉన్నాడట.

దీనిపై రివ్యూ పిటిషన్ వేయనున్నాడు అని తెలుస్తోంది.వేలాది కోట్లరూపాయల ఈ స్కాములు కేవీపి పాత్ర లేకుండానే జరిగిపోయిందా అనేది ప్రశ్నార్ధకమే.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
కూటమి మేనిఫెస్టో చూసి విస్తుపోతున్న ఏపీ ప్రజలు.. ఇవి అమలు చేస్తే శ్రీలంక కాదా అంటూ?

నిజా నిజాలు తెలియాలి అంటే కేవిపిని కూడా ఈ కేసుల్లో దోషిగా చేర్చిన‌ప్పుడే పూర్తి విచార‌ణ జ‌రిగిన‌ట్టు అవుతుంది అన్నది సూరీడు వాద‌న‌.కేవిపిపై రివ్యూ పిటిషన్ విషయంలో ఇప్పటికే న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

Advertisement

జగన్ ఒక్కడికే ఈ కేసులతో ఎలా సంభందం ఉంటుంది.కేవీపికి కూడా ఈ కేసులతో సంభందం ఉంటుదని అనేది సూరీడు వాదన.

అయితే ఈ తతంగం మొత్తం వెనుకాల.వైఎస్ఆర్ పార్టీ హస్తం కూడా ఉంది అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి.

కేవిపిని ఈ కేసుల్లో ఇరికించాలనేది సూరీడు ప్లాన్ గా తెలుస్తోంది.

తాజా వార్తలు