ఎమ్మెల్యేలు తమ పార్టీ లో ఉన్నప్పుడు వారికి సముచిత స్థానం ఇవ్వాలి.వారి ప్రతిభని బట్టి అవకాశాలు కలిపిస్తు ఉండాలి ఇది పార్టీ అధ్యక్షుడు చేయవలసిన పని.
ఒక వేళ ఎవరి మీద అయినా సరే అనుమానం కలిగితే వారి మీద నిఘా పెట్టుకోవడంలో తప్పులేదు అంతేకాని వ్యక్తిగతంగా వారి విషయాలలోకి దూరి చూడటం వారిని అవమాన పరచడమే అవుతుంది.ఇప్పుడు వైసిపి లో బగ్గుమంటున్న విషయం ఇదే.ఒక్కసారిగా ఎమ్మెల్యేలు తీవ్ర అసహనానికి గురయ్యారు
ఒక పార్టీ అధ్యక్షుడిగా ఎంతో హుందాగా ఉండవలసిన జగన్ రెడ్డి ఇప్పుడు అనుమానం తో అందరిని నానా ఇబ్బందులు పాలు చేస్తున్నారు అని ఆ పార్టీ ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు.ఈ మధ్య కాలంలో వైసీపీ నుంచి అధికార పార్టీ టిడిపిలోకి వలసలు సాగుతుండడంతో వాటిని నిరోధించలేక ఆయన వేస్తున్న ప్లాన్స్ వైసీపి మీద వ్యతిరేకతని పెంచుతున్నాయి.
అంతెందుకు పార్టీ నేతలనే కాదు కదా సొంత కుటుంబ సభ్యులను సైతం జగన్ నమ్మడు అంటున్నారు వైసిపి నుంచీ బయటకి వచ్చిన కొందరు నేతలు.అందుకే ఆయన పార్టీలో కానీ, ఎక్కడైనా కానీ మొదటి నుంచి జగన్‌తో ఉన్న వారు లేరు.
విషయం ఏమిటంటే
పార్టీలోని చాలా మంది జంపింగ్ చేస్తున్న కారణంగా జగన్ వైసీపీ ఎమ్యెల్యేల ఫోన్లు ట్యాప్ చేస్తున్నాడంట.అసలు తన పార్టీ ఎమ్యెల్యేలు ఎవరి ఎవరితో టచ్ లో ఉన్నారు .? ఎవరితో ఏమి మాట్లాడుతున్నారు అనే విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని.అలా ప్లాన్ చేసాడట.
ఈ మొత్తం వ్యవహారం లోటస్ పాండ్ నుంచే నడిపిస్తున్నాడంట.ఫోన్ ట్యాపింగ్ చేయడం చట్టరీత్యా నేరం.
చట్టాలని గౌరవించని జగన్ కి ఈ విషయం పెద్ద లెక్క కాదు కదా.అయితే ఈ అధునాతన పద్దతిని జగన్ స్కాండినేవియన్ కంట్రీస్ నుంచీ తెప్పించాడు అని టాక్
పార్టీ ముఖ్య నాయకులు ఎమ్యెల్యేలు ఇలా దాదాపుగా 60 మంది మీద నిఘా పెట్టాడట.ఈ వ్యవహారం ఎలా బయటకి తెలిసింది అంటే సాక్షి ఛానెల్లో పనిచేసిన ఒక సీనియర్ ఉద్యోగి పార్టీ వ్యవహారాలు కూడా చూస్తున్నాడు అయితే తరచూ పార్టీకి సంభందిచిన వ్యవహారాన్ని ఎవరికో చెప్పడంతో ఆయన్ని బయటకి పంపేశారు.సో దాంతో జగన్ ట్యాపింగ్ హిస్టరీ బయటకి లీక్ అయ్యింది.
ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యేలు.జగన్ చేస్తున్న ఈ వ్యవహారం మీద సీరియస్ గా ఉన్నారని టాక్.
చాలా మంది ఇలాంటి వ్యక్తి దగ్గర పనిచేయడం మా దురదృష్టం అంటూ తిట్టుకుంటున్నారట.