* అరటిపండు లో ఫైబర్ అధికపాళ్ళలో ఉంటుంది.కడుపు ఎప్పుడు శుభ్రంగా ఉండాలంటే, తిన్న తిండి బాగా అరిగి, మలంలో మొత్తం పోవాలంటే ఫైబర్ చాలా అవసరం.
అరటిపండు ఈ ఫైబర్ ని ఇస్తుంది.అంటే, మలబద్దకం లాంటి సమస్యలను, అజీర్ణం లాంటి ప్రాబ్లంను అరటిపండు నిలువరిస్తుంది అన్నమాట.
* అరటిలో కాల్షియం శాతం కూడా ఎక్కువ.మీ ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం చాలా అవసరం.లేటు వయసులో ఉన్నవారు అరటి తింటే కాల్షియం లాభలను పొందవచ్చు.* పచ్చిగా ఉండే అరటి డయాబెటిస్ పషెంట్లకు కూడా మంచివని పరిశోధనలు చెబుతున్నాయి.
అయితే షుగర్ వ్యాధీ పెద్ద స్టేజిలో ఉంటే మాత్రం కొద్దిగా ఆలోచించండి.
* ఆకలిని సులువుగా తీరుస్తుంది అరటి.ఎందుకంటే దీంట్ల కాలరీలు ఎక్కువ.90-120 కాలరీలు లభిస్తాయి సైజుని బట్టి.ఓ అయిదు అరటిపండ్లు తీసుకుంటే ఓ పూటకి కావాల్సిన కాలరీలు దొరికేసినట్టే.
* బరువు తగ్గాలనుకునే వారు కూడా అరటి తింటే మంచిది.
ఎలాగో అవసరమైన ఫైబర్ దొరుకుతుంది.కావాల్సిన దొరుకుతాయి, ఎలాంటి ఫ్యాట్స్ ఉండవు.
* అరటిలో పొటాషియం ఎక్కువ.ఇది సోడియం ఎక్కువైతే కంట్రోల్ చేసి, బ్లడ్ ప్రెషర్ ని కూడా కంట్రోల్ చేస్తుంది.పొటాషియం మజిల్ రిలాక్సేషన్ కూడా ఉపయోగపడుతుంది.కాబట్టి, నిద్రలేమి లాంటి సమస్యలు రావు.
* అల్సర్స్ లాంటి సమస్యలకు దూరంగా ఉండాలంటే అరటి రెగ్యులర్ గా తినాల్సిందే.అలాగే ఛాతిలో మంట లాంటి సమస్య ఉన్నవారు కూడా అరటి మీద ఆధారపడవచ్చు.
అరటి శరీరంలోని pH లెవల్స్ ని బ్యాలెన్స్ చేసి ఈ సమస్యలను దూరం చేస్తుంది.
* అరటి ఎక్కువగా తినడం వలన క్యాన్సర్ వచ్చే అవకాశాలు గణనీయంగా పడిపోతాయని జపాన్ పరిశోధకులు చెబుతున్నారు.
అరటి శరీరంలో వైట్ బ్లడ్ సెల్స్ ని పెంచుతుంది.అలా రోగనిరోధక శక్తి పెరగటం వలన క్యాన్సర్ కణాలు సులువుగా పెరగలేవు.