ఏం మాయ చేసావేతో తెలుగు కుర్రాలందరిపై మాయ చేసింది సమంత.తన అందంతో, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మదిలో మొదటి సినిమాతో ఓ గుర్తింపు సాధించింది.
కేవలం కాలేజి కుర్రాళ్ళే కాదు, సినిమా సెలబ్రిటిలు కూడా సమంతతో ప్రేమలో పడ్డారు.సిద్దార్థ్ – సమంతలపై చాలాకాలంపాటు ప్రేమాయణం నడిచింది.
కాని పెళ్ళిపీటల దాకా వెళుతుంది అనుకున్న ప్రేమకథకి మధ్యలోనే ఎండ్ కార్డు వేసేసారు ఇద్దరు.కాని కొన్నిసార్లు ఓ బంధం తెగుతోంది అంటే మరో అందమైన బంధం మన కోసం ఎదురుచూస్తున్నట్టు.
అదే జరిగింది సమంత విషయంలో సోల్ మెట్ అంటారు చూడండి … అలా దొరికాడు నాగచైతన్య.
ఇద్దరి ప్రేమకథ సెట్ అయిపొయింది.
అక్టోబర్ వస్తే ఇద్దరికీ పెళ్ళి కూడా జరిగిపోతుంది.ఈరకంగా టాలివుడ్ లో మోస్ట్ హ్యపెనింగ్ జంట ఒక్కటి అయిపోతారు.
దాంతో చైతుకి లైన్ వేద్దామనుకున్న అమ్మాయిలు, సమంతని ట్రై చేద్దామని అనుకున్న అబ్బాయిలు అందరు సైడ్ అయిపోవాల్సింది.ఆ సైడ్ అయిపోవాల్సిన లిస్టులో మెగాహీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఉండటం విశేషం.
నాగచైతన్య లేకపోయుంటే సమంతని ట్రై చేసేవాడ్ని అని స్వయంగా ఈ హీరోనే ఒప్పుకున్నాడు.
జవాన్ లో పోలీసు పాత్ర పోషించిన సాయి ధరమ్ తేజ్ ఇండిపెండెన్స్ డే సంధర్భంగా హైదరాబాద్ లోని సిఆర్ క్వాటర్స్ లో ఓ బెటాలియన్ ని కలిసి కాసేపు కబుర్లు చెప్పాడు.
ఆ మాటామంతిలోనే ఓ ప్రశ్నకు సమాధానంగా తనకి ఇష్టమైన కథానాయిక సమంత అని, చాలా అందంగా ఉంటుందని, ఒకవేళ నాగచైతన్య సమంత లైఫ్ లో లేకపోయుంటే తాను సమంతని ట్రై చేసేవాడినని ఒప్పేసుకున్నాడు సాయి ధరమ్ తేజ్.ఆ రకంగా ఇండస్ట్రీలో ఓ లవ్ స్టోరి పుట్టక మునుపే ఎండ్ అయ్యింది అన్నమాట.
ఇక జవాన్ విషయానికి వస్తే, ఈ సినిమా రచయిత బీఎస్ రవి దర్శకత్వంలో తెరకెక్కింది.దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రంలో మేహ్రీన్ కథానాయిక.







