జుట్టు వేగంగా పెరగటానికి టీ ట్రీ ఆయిల్

ప్రతి మహిళ అందమైన మరియు ఒత్తైన జుట్టు కావాలని కలలు కంటుంది.అయితే జుట్టు సహజంగా పెరగటానికి టీ ట్రీ ఆయిల్ లో ఉండే లక్షణాలు సహాయపడతాయి.

 Tea Tree Oil For Hair Grow-TeluguStop.com

టీ ట్రీ ఆయిల్ ని జుట్టు నష్టం, చుండ్రు వంటి సమస్యల నివారణకు ఉపయోగిస్తారు.ఈ ఆయిల్ జుట్టు మరియు తల మీద చర్మం తేమగా ఉండేలా చేస్తుంది.ఇప్పుడు టీ ట్రీ ఆయిల్ జుట్టు పెరుగుదలకు ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

1.టీ ట్రీ మరియు ఆలివ్ ఆయిల్
ఆలివ్ నూనెతో టీ ట్రీ ఆయిల్ కలిసినప్పుడు జుట్టు పెరుగుదలలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.టీ ట్రీ మరియు ఆలివ్ ఆయిల్ లో ఉండే బ్యాక్టిరియాల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు జుట్టు మీద బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాలను నాశనం చేస్తుంది.

అంతేకాక జుట్టు నష్టానికి ప్రధాన కారణం అయిన డిటిహెచ్ హార్మోన్ ని చెక్ చేస్తుంది.

కావలసినవి
టీ ట్రీ ఆయిల్ – 7 నుంచి 10 చుక్కలు
వెచ్చని ఆలివ్ నూనె – 3 టేబుల్ స్పూన్లు

పద్దతి
* ఒక బౌల్ లో గోరువెచ్చని ఆలివ్ ఆయిల్ తీసుకోని దానిలో టీ ట్రీ ఆయిల్ ని కలపాలి
* ఈ మిశ్రమాన్ని జుట్టుకు రాయాలి
* తలకు షవర్ క్యాప్ పెట్టి రాత్రంతా అలా వదిలేయాలి
* మరుసటి రోజు ఉదయం సాధారణ షాంపూ ఉపయోగించి తలస్నానం చేయాలి
* ఈ పద్దతి జుట్టు పెరుగుదలకు మరియు చుండ్రు నివారణకు బాగా సహాయపడుతుంది.

2.టీ ట్రీ ఆయిల్ ని షాంపూలో కలపాలి
జుట్టు పెరుగుదలకు టీ ట్రీ ఆయిల్ ని షాంపూలో కలపటం ఒక మంచి పద్దతి
జుట్టు వృద్ధికి ప్రధాన అడ్డంకులు అయిన చర్మ దురద, చుండ్రు వంటి సమస్యలను
నివారించి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

కావలసినవి
టీ ట్రీ ఆయిల్
సాదారణ షాంపూ

పద్దతి
* ఒక చిన్న గిన్నెలో అవసరమైన షాంపూ తీసుకోవాలి
* దీనిలో 5 చుక్కల టీ ట్రీ ఆయిల్ ని కలపాలి
* ఈ మిశ్రమాన్ని జుట్టు మరియు తల మీద చర్మం మీద రాసి మసాజ్ చేయాలి
* ఐదు నిముషాలు అయ్యాక సాదారణ నీటితో శుభ్రం చేసుకోవాలి
* ఈ విధంగా క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే జుట్టు పెరుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube