అది కేరళ రాష్ట్రం, తిరువనంతపురంలోని కొల్లాం అనే ప్రాంతం.అక్కడ గణేశానంద తీర్థపద స్వామి అలియాస్ హరి అనే దొంగబాబా ఉంటాడు.
అతని దుర్భుద్దులు తెలియక అతని సేవలో చాలామంది భక్తులు ఉంటారు.ఓ 23 ఏళ్ల అమ్మాయి కూడా తన తల్లిదండ్రులతో పాటే ఆశ్రమంలో ఉంటోంది.
ఈ కుటుంబం ఆ బాబాకి సేవలు చేసుకుంటూ కొన్ని ఏళ్లుగా అదే ఆశ్రమంలో ఉంటున్నారు.అయితే ఆ దొంగబాబా కన్ను ఈ 23 ఏళ్ల యువతిపై పడింది.
తన లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు.తన కోరిక తీర్చాలంటూ ఒత్తిడి తెచ్చాడు.
గత అయిదారు రోజులుగా నరకం చూపించాడట.అయినా పాపం ఆ అమ్మాయి తన మాటలు ఎవరు పట్టించుకోరు అనే భయంతో ఆ బాబా ఆగడాలను బయటపెట్టలేదు.
ఇక నిన్న రాత్రి తన హద్దులు దాటాడు.ఆ అమ్మాయిపై అత్యాచారయత్నం చేసాడు.
ఎంత వద్దన్నా బలవంతం చేయబోయాడు.దాంతో దగ్గరిలో ఉన్న కత్తి తీసుకున్న ఆ అమ్మాయి వెంటనే అతడి జననాంగంపై దాడి చేసింది.
పురుషాంగాన్ని కోసేసింది.ఈ ఇంసిడెంట్ జరిగిన వెంటనే తిరువనంతపురం పోలీసులకి తానే ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పింది.
పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని తన రిపోర్టు తీసుకున్నారు.పోస్కో చట్టం కింద గణేశానంద స్వామిపై కేసు బుక్ చేస్తారు.
అతడిని తిరువనంతపురం మెడికల్ కాలేజి హాస్పిటల్ కి తరలించారు.బాబా పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు.
తన రక్షణ కోసమే అమ్మాయి ఈ దాడి చేయడంతో తనపై ఎలాంటి కేసుని నమోదు చేయలేదు పోలీసులు.
రేప్ చేయబోయిన వ్యక్తీ అంగంపై ఇలా కత్తితో దాడి జరగడం ఇదే మొదటిసారి కాదు.గత ఏడాది అసోంలో ఒకటి ఇలాంటి సంఘటనే జరిగింది.బిహార్ లో ఓ అమ్మాయి ఇలానే బండరాయితో అత్యాచారం చేయబోయిన పురుషుడి అంగం మీద దాడి చేసింది.
ఆ రెండు సందర్భాల్లో ఆ వ్యక్తులు మరణించారు.ఇప్పుడు ఈ బాగా కూడా బ్రతకడం కష్టమే అంటున్నారు.