ఆ హీరోయిన్ బాగా హర్ట్ అయ్యింది

రితూ వర్మ ఇండస్ట్రీ లోకి వచ్చి కొంత కాలమైనా, ఇన్నిరోజులు సరైన సినిమా దొరక్క పేద్దగా పేరు సంపాదించుకోలేక పోయింది.ఆలస్యమైతే అయ్యింది కాని, పెళ్ళిచూపులు సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీ చూపు మొత్తం తనవైపు తప్పుకుంది ఈ భామ.

 Ritu Varma Gets Hurt With False Reports From Media-TeluguStop.com

సినిమా ఇటు బాక్సాఫీసు వద్ద భారి విజయం నమోదు చేసుకోవడంతో పాటు, రితూ నటనకి మంచి పేరు సంపాదించిపెట్టింది.

దాంతో అడివి శేష్ సినిమాలో ఛాన్స్ దొరికింది.

అయితే ఆ సినిమా ఇప్పుడు రితూ దాదాపుగా చేయట్లేదట.ఈ విషయాన్ని మీడియా తెలియజేస్తూ, రితూకి అప్పుడే సక్సెస్ నెత్తికి ఎక్కిందని, రెమున్యరేషన్ కూడా పెంచి నిర్మాతలకి చుక్కలు చూపిస్తోందని, అందుకే అడివి శేష్ సినిమా వదిలేసిందనే వార్తలు వచ్చాయి.

ఈ వార్తలు విని రితూ బాగా హర్ట్ అయ్యిందట.నిజానికి అడివి శేష్ సినిమా వదిలేయడానికి వేరే కారణాలు ఉన్నాయట.కాని మీడియా లేనిపోనివి రాసింది అని రితూ బాధపడుతోంది.మీడియా అన్ని తప్పులే రాసిందని, అడివిశేష్ అంటే తనకి ఎంతో గౌరవమని చెప్పింది రితూ.

ఇక మిగితా వార్తల్లో, రితూవర్మ ప్రస్తుతం నిఖిల్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube