జిల్లాల ఆందోళ‌న‌లూ... కేసీఆర్‌కు కొత్త త‌ల‌నొప్పులు

తెలంగాణ‌లో మ‌రో జిల్లాల‌ల‌ను ఎర్పాటు చేయాల‌న్న ్ర‌ప‌భుత్వ ్ర‌ప‌తిపాద‌న‌ల‌ను స్వాగ‌తిస్తునే, త‌మ ప్రాంతాన్ని జిల్లాగా ప్ర‌క‌టించాలంటూ చేస్తున్న ఆందోళ‌న‌లు మిన్నంటుతున్నాయి.గద్వాల, యాదాద్రి, భువనగిరి, ములుగు, జనగాం, కల్వకుర్తి, షాద్‌నగర్,వనపర్తి, ఇబ్రహీం పట్నంలను కూడా జిల్లా కేంద్రాలుగా చేయాలని ఆయా ప్రాంతాల్లోని నాయకులు ఉద్యమాలు చేస్తున్నారు.

 Kcr Worries With New Districs-TeluguStop.com

అయితే యాదాద్రి మినహా కొత్తగా పుట్టుకొచ్చిన డిమాండ్లనేవి జిల్లా పునర్‌ఏర్పాటు కమిటీ పట్టించుకోలేదని దీంతోనే కొత్త స‌మ‌స్య‌లు పుట్ట‌కొచిచ్చ‌న‌ట్టు విశ్లేష‌కులు భావిస్తున్నారు.

గద్వాల కేంద్రంగా కొత్త జిల్లా కావాలంటూ ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్నా, స్ధానిక‌ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిరెడ్డి త‌మ‌కు స‌హ‌క‌రించ‌డంలేదంటూ ఇంటిని ముట్టడించారు.

ఆర్టీసీ బస్సుపై పెట్రోల్‌పోసి నిప్పంటించారు.ఈ ప‌రిస్ధితి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా అంత‌టా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.

ఇక భద్రాచలం పేరుతో కొత్త జిల్లా కావాలని డివిజన్ ప్రజలు ఎప్పటి నుండో ఉద్యమిస్తున్నా, అయితే, రాష్ట్ర విభజన నేపధ్యంలో భద్రాచలం డివిజన్‌కు చెందిన మండలాలను ఆంధ్రలో కలిపేయటంతో భద్రాచలం జిల్లా ఏర్పాటు అటకెక్కేసింద‌న్న‌ది వాస్త‌వం.అయితే కొత్తగూడెం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాల‌ని దీనికి భద్రాచలం జిల్లాగా పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన‌ట్టు తెలియ‌రావ‌టంతో ఆ ్ర‌పాంత ్ర‌ప‌జ‌లు కొంత శాంతియుతంగా ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది.

ఇక జనగామను జిల్లాగా చేసే అవకాశం లేదంటూ వచ్చిన వార్తలతో ఉద్యమాన్నివ‌రంగ‌ల్ జిల్లాలోనూ ఉద్య‌మం ఉధృతమ‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.ఇక కరీంనగర్ జిల్లాలో కొత్తగా రామగుండం కేంద్రంగా జిల్లా ఏర్పాటు కావాలని డిమాండ్ చేస్తున్నా, జగిత్యాల కేంద్రంగా జిల్లా ఏర్పాటు జరుగుతుందంటూ విన‌వ‌స్తుండ‌టంతో ఆ ్ర‌పాంత ప్ర‌జ‌లు వ్యతిరేకిస్తున్నారు.

అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల జిల్లా ఏర్పాటుకు తెలంగాణ ్ర‌ప‌భుత్వం సిద్ధ‌మ‌వుతోంద‌ని తెలియ వ‌స్తుండ‌గా, బెల్లంపల్లిని జిల్లా కేం్ర‌దంగా ఏర్పాటుఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

ప్రస్తుతం తెలంగాణాలో ఏ జిల్లాను చూసినా పైన ఉదహరించినట్లు కొత్త జిల్లాల డిమాండ్‌తో ఆందోళనలు ఊపందుకోవ‌టంతో కొత్త త‌ల‌నొప్పులు కోరి తెచ్చుకున్న‌ట్లుంద‌ని తెరాస ్ర‌శేణులే భావిస్తున్నాయి.

జిల్లాల‌ల ఏర్పాటులో తాను అనుకున్నదొకటైతే క్షేత్రస్ధాయిలో జరుగుతున్నదొకటిగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ సైతం స‌న్నిహితుల వ‌ద్ద వాపోయిన‌ట్టు విన‌వ‌స్తోంది.బంగారు తెలంగాణా నిర్మాణమంటూ తాను ఏమి చేసినా ప్రజలు, విపక్షాలు మాట్లాడకుండా ఉంటాయని అనుకున్న వారికి కొత్త ఆయుదాలిచ్చిన‌ట్టు ప‌రిస్ధితి త‌యారైంద‌ని సీనియ‌ర్లు సైతం కేసీఆర్‌కు తెలియ చేయ‌టంతో ద‌స‌రా నాటికి త‌థ్య‌మ‌నుకున్న జిల్లాల ఏర్పాటు ప్ర‌క్రియ కొంత కాలం నిల‌పివేయాల‌ని భావిస్తున్న‌ట్టు స‌మాచారం.ఏం జ‌ర‌గ‌నుందో మ‌రి కొంత కాలం వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube