మన దేశంలో ఎంతో ప్రసిద్ది చెందిన శ్రీకృష్ణ ఆలయాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా?

మధురలో చెరసాలలో దేవికి వసుదేవులకు పుట్టి రేపల్లెలో యశోద దగ్గర పెరిగి కన్నయ్యగా అందరి చేత కొలువబడుతున్న విష్ణుమూర్తి దశావతారాలలో తొమ్మిదవ అవతారమే శ్రీకృష్ణ అవతారం.

విష్ణు భగవానుడు దుష్ట శక్తుల సంహారనార్థం దశావతారాలు ఎత్తడనే విషయం మనకు తెలిసినదే.

ఈ క్రమంలోనే శ్రీకృష్ణ అవతారంలో విష్ణుదేవుడు కలియుగంలో దర్శనం కల్పించారు.ఈ క్రమంలోనే శ్రీకృష్ణుడికి పవిత్రమైన ఆలయాలను నిర్మించి భక్తులు పెద్దఎత్తున పూజా కార్యక్రమాలను నిర్వహించేవారు.

ఇప్పటికీ మన దేశంలో కొన్ని శ్రీకృష్ణుడి ఆలయాలలో భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి.మన దేశంలో ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ ఆలయాలు ఎక్కడ ఉన్నాయి అనే విషయాలను తెలుసుకుందాం.

ఇస్కాన్ దేవాలయం: ప్రపంచవ్యాప్తంగా శ్రీకృష్ణుడికి ఎన్నో చోట్ల ఇస్కాన్ ఆలయాలను నిర్మించి ఉన్నారు.ఈ ఆలయాలకు భక్తులు కులమతాలకు అతీతంగా వచ్చే స్వామివారిని దర్శనం చేసుకొంటారు.

Advertisement

ద్వారకాదీశ ఆలయం: గుజరాత్ పశ్చిమ తీరంలో ఉన్న ద్వారక పవిత్ర పుణ్యస్థలంగా భావించబడుతుంది.ఈ ఆలయ మండపంలో మూడు పెద్ద ఉయ్యాలలు మనకు దర్శనమిస్తాయి.

ఇందులో మధ్యలో ఉన్నది బంగారు కాగా మరో రెండు వెండి ఉయ్యాలలు ఉన్నాయి.బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీకృష్ణుడిని ఉయ్యాలలో శయ్యా వేడుకలు జరుపుతారు.బృందావన్ ఆలయం:

శ్రీకృష్ణుడు చిన్నతనమంతా బృందావనంలోనే ఆటలాడాడని పురాణాలు చెబుతున్నాయి.ఎంతో సుందరమైన ఈ ప్రదేశాన్ని సందర్శించిన అక్బర్ ఇలాంటి ఆలయాలను మరికొన్ని నిర్మించాలని ఆదేశించాడు.ఈ క్రమంలోనే మధురలో ఉన్నటువంటి బృందావనం ఎంతో ప్రసిద్ధి చెందినది.జగన్నాథ ఆలయం:

మన దేశంలో ఎంతో ప్రసిద్ది చెందిన శ్రీకృష్ణ ఆలయాలలో జగన్నాథ్ ఆలయం ఒకటి.అహ్మదాబాద్‌ నగరంలోని జమల్‌పూర్ అనే ప్రాంతంలో వెలసి వున్న ఈ ఆలయం ఈ నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.కృష్ణుడు, విష్ణువు ఆశీర్వాదం పొందాలనుకునే భక్తులు పెద్ద ఎత్తున ఈ జగన్నాథ ఆలయానికి చేరుకుంటారు.

నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?
Advertisement

తాజా వార్తలు