అక్కడ సోనూసూద్ కు 390 అడుగుల కటౌట్.. విద్యార్థులు అభిమానాన్ని చాటుకున్నారుగా!

సోనూసూద్.( Sonu Sood ) ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ఇప్పటికే కొన్ని వేలాదిమందికి సహాయం చేసి కలియుగ కర్ణుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు సోనూసూద్‌.కరోనా సమయం నుంచి సేవా కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టిన సోనుసూద్ ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు.

ప్రాంతము భాషతో సంబంధం లేకుండా కష్టం ఎక్కడ ఉంది అంటే చాలు అక్కడ వాలిపోయి వారికి నేనున్నాను అంటూ కొండంత భరోసాని ఇస్తూ ఉంటారు.అందుకే సోను సూద్ మీ దేవుడిగా భావించి చాలామంది ఫోటోలకు పూజలు కూడా చేస్తున్నారు.

ఆయనకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే.

Advertisement

చిన్నాపెద్దా తేడా లేకుండా ఆయన్ని అందరూ అభిమానిస్తుంటారు.తాజాగా షోలాపుర్‌ లోని( Solapur ) విద్యార్థులు సోనూసూద్‌ పై అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు.390 అడుగుల భారీ కటౌట్‌ ను ఏర్పాటు చేసి రికార్డు సృష్టించారు.సోనూసూద్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఫతేహ్‌( Fateh Movie ) జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌ హీరోయిన్ గా నటించింది.

ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచే సుకున్న ఈ మూవీ జనవరి 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ నేపథ్యంలో 500 మంది విద్యార్థులు 390 అడుగుల కటౌట్‌ ను సిద్ధం చేసి ఊరేగించారు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది.

ఈ వీడియోను పంచుకున్న సోనూసూద్‌ 500 మంది విద్యార్థులు.ఒక్క ఎమోషన్‌.ఫతేహ్‌ అని క్యాప్షన్‌ పెట్టారు.

Dandruff Homemade Serum : ఈ హోమ్‌ మేడ్ సీర‌మ్ ను వాడితే డాండ్రఫ్ అన్న మాటే అన‌రు!

ఈ పోస్ట్ వైరల్ కావడంతో ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము అంటూ కామెంట్లు చేస్తున్నారు అభిమానులు.ఇకపోతే సోను సూచి నటించినా ఫతేహ్ సినిమా విషయానికి వస్తే.

Advertisement

యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది.ఈ చిత్రంలో జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌ మునుపెన్నడూ చేయని యాక్షన్‌ సన్నివేశాలతో ప్రేక్షకులను అలరించనుంది.

నసీరుద్దీన్‌ షా, విజయ్‌ రాజ్‌ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.సైబర్‌ మాఫియా కథ ఆధారంగా దీనిని చిత్రీకరించారు.

జీ స్టూడియోస్, శక్తి సాగర్‌ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.మరో రెండు రోజుల్లో ఈ సినిమా విడుదల కానుంది.

ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఈ సినిమాపై అంచనాలు పెంచాయి.

తాజా వార్తలు